
📌 Key Points
- ఢిల్లీలోని రోహిణిలో అగ్నిప్రమాదం, ముగ్గురు సజీవ దహనం.
- ప్లాస్టిక్ తుక్కు గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం.
- మృతుల్లో భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.
- సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ తుక్కు గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్లాస్టిక్ గోడౌన్‌లో ప్రమాదం
భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు సజీవ దహనమయ్యారు (Three people burned alive). ఈ దిగ్బ్రాంతి కరమైన సంఘటన ఢిల్లీలోని రోహిణి ఏరియాలో బుధవారం (ఏప్రిల్ 15, 2026) తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధ్ విహార్‌లోని మంగేరామ్ పార్క్ సమీపంలో ఉన్న ఒక ప్లాస్టిక్ తుక్కు (Scrap) గోడౌన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 1:25 నుంచి 1:35 గంటల మధ్య మంటలు చెలరేగాయి. మృతుల్లో భర్త, భార్య, వారి రెండేళ్ల చిన్నారి ఉన్నారు.
గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో వారు బయటపడలేకపోయారని తెలుస్తోంది. గోడౌన్‌లో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు, స్క్రాప్ మెటీరియల్ ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 6 నుంచి 7 ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని వీధులు చాలా ఇరుకుగా ఉండటంతో పెద్ద ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ, సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఉదయం 4:35 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి మూడు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబం సజీవ దహనం
సహాయక చర్యలు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


