
📌 Key Points
- విజయ్ పార్టీ ద్వారా త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు.
- అసెంబ్లీ ఎన్నికల వేళ త్రిష చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరుగుతున్నాయని సమాచారం.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో త్రిష భేటీ అయ్యారని సమాచారం.
- టీవీకే, బీజేపీ, ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అంచనాలు.
కోలీవుడ్ నటి త్రిష కృష్ణన్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ద్వారా ఆమె పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
త్రిష రాజకీయ ప్రవేశం?
Trisha Krishnan:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు విజయ్(Vijay )- త్రిష(Trisha).. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ రిలేషన్ ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించడమే దీనికి ప్రధాన కారణం.. దీనికి తోడు విజయ్- త్రిష చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు జంటగా ఒకే కారులో రావడమే కాకుండా ఒకే రకమైన దుస్తులు ధరించి రూమర్లకి మరింత ఆజ్యం పోశారు. పైగా త్రిష రాజకీయాలలోకి రాబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ తో ఆమె చనువుగా ఉంది కాబట్టే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ద్వారా ఏదో ఒక ప్రాంతం నుండి ఆమె పోటీ చేస్తారు అనే వార్తలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో .. ప్రస్తుతం ఆమె పొత్తులో కీలకము కానున్నారు అనే వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ , ఎన్డీయే తో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందనే వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా త్రిష భేటీ అయ్యారని, దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడం లేదు అని సమాచారం. మరొకవైపు ఏఐఏడిఎంకె నేతలు కూడా త్రిష తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఇలా మొత్తానికైతే టీవీకే , బిజెపి, ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకుని డిఎంకెను ఢీ కొట్టబోతున్నాయనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
అమిత్ షాతో త్రిష భేటీ
ఏది ఏమైనా ఈ వార్తలు విన్న నెటిజన్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా మూడు పార్టీలు కలిసి ఒకే పార్టీని ఢీకొట్టబోతున్నాయా అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూడు పార్టీల పొత్తులో కీలకము కానున్న త్రిషకి ఆ మూడు పార్టీలు కూటమిలాగా ఏర్పడి అధికారంలోకి వస్తే.. త్రిషకి ఏదైనా కీలక పదవి ఇస్తారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై త్రిష లేదా ఆయా పార్టీలు స్పందించాల్సి ఉంటుంది.
పొత్తుల వ్యూహంలో త్రిష పాత్ర
త్రిష విషయానికి వస్తే.. గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది.. గతంలో ప్రభాస్ తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి .ఆ తర్వాత ఒక వ్యాపారవేతతో నిశ్చితార్థం జరిగింది. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసు దాటిన ఇంకా ఒంటరిగానే ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ తో ఆమె చట్టపట్టలేసుకొని తిరగడం వల్లే ఇలాంటి రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విజయ్ భార్య సంగీత కూడా ప్రముఖ సినీ నటి వల్లే తన భర్త తనకు దూరం అయ్యారని.. అందుకే తాను విడాకులు కోరుతున్నట్లు ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఇక ఇలాంటి వార్తలు రోజుకొకటి వినిపిస్తున్న నేపథ్యంలో త్రిష మరో జయలలిత కానుంది అనే కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నిజానిజాలు బయటకు వచ్చేవరకు ఏదీ నిజమని మనం తేల్చలేము.
మొత్తానికి త్రిష రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


