|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రిష: విజయ్‌ బర్త్ డే.. త్రిష స్పెషల్ ఫోటో వైరల్

Published: 22-06-2025, 11:14 PM
త్రిష: విజయ్‌ బర్త్ డే.. త్రిష స్పెషల్ ఫోటో వైరల్

తమిళ సూపర్ స్టార్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో వల్ల వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి.

Key Points

1

త్రిష విజయ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపారు.

2

త్రిష పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4

ఈ ఫోటో పాతదా లేక కొత్తదా అనేది స్పష్టంగా లేదు.

త్రిష విజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్‪‌లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.

దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం ‘హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్’ అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్‌తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.

వైరల్ అవుతున్న ఫోటో

ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ ‘జన నాయగణ్’ మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.

డేటింగ్ రూమర్స్ మళ్ళీ మొదలయ్యాయి

త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో ’96’ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తోంది.

త్రిష పోస్ట్ చేసిన ఫోటో వల్ల విజయ్ మరియు త్రిష డేటింగ్ గురించి మళ్ళీ చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఫోటో పాతదా కొత్తదా అనేది ఇంకా తెలియదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.