|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెంకటేష్, త్రివిక్రమ్ మాయ.. బాక్సాఫీస్ బద్దలే! ఈ కాంబోతో ఇండస్ట్రీ హిట్ పక్కానా?

Published: 23-03-2026, 8:05 AM
వెంకటేష్, త్రివిక్రమ్ మాయ.. బాక్సాఫీస్ బద్దలే! ఈ కాంబోతో ఇండస్ట్రీ హిట్ పక్కానా?
  • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ చిత్రం తెరకెక్కనుంది.
  • ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
  • సినిమా షూటింగ్ 40% పూర్తయింది, అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
  • హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ విశేషాలు

Trivikram – Venkatesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న విక్టరీ వెంకటేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకున్న ఈయన.. మాస్ పెర్ఫార్మెన్స్ తో అటు మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు స్టార్ హీరోల చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న వెంకటేష్.. ఈ ఏడాది మళ్లీ అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మరో ఇండస్ట్రీ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. అయితే ఇప్పుడు మరో గ్రాండ్ సక్సెస్ కి సిద్ధం అయిపోయారు వెంకటేష్.

అందులో భాగంగానే మాటల మాంత్రికుడు, ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.’ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47′ అనే టైటిల్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ హీరో నారా రోహిత్, తమిళ్ నటుడు యోగి బాబు కీలక పాత్రలు పోషించనున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో త్రివిక్రమ్ తన మార్కు చూపించబోతున్నారని, కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

‘ఆదర్శ కుటుంబం’లో నటీనటులు

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం వరకు పూర్తవగా.. ఈ ఏడాది అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుm ఈ నేపథ్యంలోనే అటు ఒక భారీ సెట్ లో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం . ముఖ్యంగా ఇందులో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఈ చిత్రానికే హైలెట్గా నిలవనున్నాయని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు..

అక్టోబర్ 2న విడుదల కానున్న సినిమా

ఇకపోతే చాలా ఏళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు, స్క్రీన్ ప్లే అందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలలో వెంకటేష్ హీరో నటించారు. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీనికి తోడు త్రివిక్రమ్ ఇందులో తన మార్క్ చూపించబోతున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ త్రివిక్రమ్ గనుక మళ్ళీ తన మార్క్ డైరెక్షన్ చూపిస్తే గనుక వెంకటేష్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడడం గ్యారెంటీ అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి.

మొత్తానికి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.