
📌 Key Points
- ఇరాన్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ నిరాకరణ, చర్చలకు మాత్రం సిద్ధం.
- ఇరాన్ నేవీ, వైమానిక దళాలను అమెరికా నాశనం చేసిందని ట్రంప్ ప్రకటన.
- హార్ముజ్ జలసంధి భద్రత బాధ్యతలను ఇతర దేశాలు తీసుకోవాలని సూచన.
- ఇరాన్ నుండి ముప్పు ఎదురైతే తిప్పికొట్టేందుకు అమెరికా సంసిద్ధంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నామని, కాల్పుల విరమణ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధమని తెలిపారు.
ఇరాన్‌తో కాల్పుల విరమణపై ట్రంప్ స్పష్టీకరణ
ఇరాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నామని.. ఇలాంటి సమయంలో సీజ్ ఫైర్ (Ceasefire) అవసరం లేదని పేర్కొన్నారు ట్రంప్. ఇరాన్ తో యుద్ధంలో సీజ్ ఫైర్ పై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. చర్చలు ఇరాన్ తో జరపవచ్చు, కానీ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని తాను అనుకోవడంలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అవతలి పక్షాన్ని నాశనం చేస్తున్నప్పుడు మనకు సీజ్ ఫైర్ అవసరం లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ నావికా, వైమానిక దళాలను ధ్వంసం చేశామన్న ట్రంప్
ఇరాన్ కు సంబంధించిన నేవీ, వైమానిక దళాలను ఫినిష్ చేసినట్లు తెలిపారు. అసలు వారి దగ్గర ఎలాంటి పరికరాలు లేవని తాజాగా మీడియాతో వెల్లడించారు. అమెరికా అనుకుంటే ఇప్పుడే యుద్ధాన్ని ముగించగలదని స్పష్టం చేశారు. ఇరాన్ పై ఐదు ప్రధాన లక్ష్యాలపై అమెరికా విజయం సాధించిందని తెలిపారు. హార్ముజ్ జలసంధి ( Strait of Hormuz) మార్గాన్ని ఉపయోగించుకునే దేశాలే ఇకపై భద్రత బాధ్యతలను స్వీకరించాలని ఆయన తెలిపారు. ఇరాన్ నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ట్రంప్.
హార్ముజ్ జలసంధి భద్రత బాధ్యత ఇతరులదే
A post shared by AlMamlaka English (@almamlakaen)
ట్రంప్ ప్రకటనతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


