|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Trump Effect : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాలో సినిమా టికెట్ రేట్లు ఎంత పెరగనున్నాయి.. టాలీవుడ్ పై ఎఫెక్ట్ ఎంత?

Published: 30-09-2025, 6:18 AM
Trump Effect : ట్రంప్ టారిఫ్ దెబ్బ.. అమెరికాలో సినిమా టికెట్ రేట్లు ఎంత పెరగనున్నాయి.. టాలీవుడ్ పై ఎఫెక్ట్ ఎంత?

ట్రంప్ అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% పన్ను విధించడంతో, అమెరికాలో రిలీజయ్యే విదేశీ చిత్రాలకు భారీ దెబ్బ. దీనివల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కానున్నాయి. టాలీవుడ్ సినిమాల భారీ కలెక్షన్లపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపనుంది, ప్రేక్షకులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది.

Key Points

1

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ సినిమాలపై 100% పన్నులు ప్రకటించారు.

2

దీంతో అమెరికాలో సినిమా టికెట్ ధరలు రెట్టింపు కానున్నాయి (ఉదా: $10 టికెట్ $20 అవుతుంది).

4

ఓజీ వంటి చిత్రాలు సాధించిన 5 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు ఈ టారిఫ్ గండి కొట్టనుంది.

ట్రంప్ టారిఫ్: టాలీవుడ్‌కు భారీ షాక్?

Trump Effect : తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై వంద శాతం పన్నులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో రిలీజయ్యే వేరే దేశాల సినిమాలకు భారీగా ఎఫెక్ట్ అవ్వనుంది. మన టాలీవుడ్ కి కూడా కష్టమే. సాధారణంగానే మన టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంది, భారీ కలెక్షన్స్ వస్తాయి.(Trump Effect)

ఇప్పుడు ట్రంప్ వేసిన వంద శాతం పన్నులతో ఇకపై కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల రిలీజయిన OG సినిమా 5 మిలియన్ డాలర్స్ కి పైగా అయిదు రోజుల్లోనే అమెరికా నుంచి కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 42 కోట్ల పైనే. ఇప్పుడు ఆ టారిఫ్ లతో ఈ రేంజ్ కలెక్షన్స్ కి గండి పడుతుంది.

అమెరికాలో సినిమా టికెట్ ధరలు రెట్టింపు

ఉదాహరణకు అమెరికాలో మన తెలుగు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాని ఒక మిలియన్ డాలర్స్ కి కొంటే ఇంకో మిలియన్ డాలర్స్ అమెరికాకు పన్ను చెల్లించాల్సిందే. దీంతో ఆటోమేటిక్ గా అక్కడ టికెట్ రేట్లు పెరుగుతాయి.

ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాలకు టికెట్ రేట్లు 10, 14, 20 డాలర్లు ఉన్నాయి. ఈ టారిఫ్ తో 10 డాలర్ల టికెట్ రేటు 20 డాలర్లు అవుతుంది. 20 డాలర్ల టికెట్ రేటు 40 డాలర్లు అవుతుంది. ఇక అమెరికాలో రాష్ట్రాలకు సపరేట్ పన్నుల విధానం కూడా ఉండటంతో కొన్ని చోట్ల ఆ టికెట్ రేటు 30 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకు కూడా అవ్వొచ్చు.

టాలీవుడ్ కలెక్షన్‌లపై టారిఫ్ ప్రభావం

ఈ టికెట్ రేటు మాములు థియేటర్స్ లోనే. ఖరీదైన మల్టీప్లెక్స్, ఐమాక్స్ లాంటి థియేటర్స్ లో టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. దీంతో ఇప్పుడు థియేటర్స్ కి వస్తున్నట్టు అప్పుడు కూడా తెలుగు వాళ్ళు అమెరికాలో సినిమాలకు ఎగబడతారా అనేది అనుమానమే. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తప్ప అక్కడ చదువుకోడానికి వెళ్లి, పార్ట్ టైం చేస్తూ బతుకుతున్న వాళ్ళు మాత్రం ఇంత రేటు పెట్టి మన తెలుగు సినిమాలను చూడటం కష్టమే అని అంచనా వేస్తున్నారు. మరి ఈ వంద శాతం టారిఫ్ లు ఇలాగే ఉంటాయా? తగ్గుతాయా? తర్వాత ఏదైనా సవరణలు చేస్తారా చూడాలి.

ఈ 100 శాతం టారిఫ్‌తో అమెరికాలో తెలుగు సినిమా ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం పడనుంది. టికెట్ రేట్లు పెరిగితే థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ టారిఫ్‌లలో మార్పులు వస్తాయో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.