
మలయాళ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మరో మూడు చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. కామెడీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో వచ్చిన ఈ సినిమాలు, సిరీస్ ఏంటో తెలుసుకుందాం.
Key Points
ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన 'ఆప్ కైసే హో' కామెడీ సినిమా సన్ నెక్స్ట్ లో!
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2' జియోహాట్‌స్టార్ లో!
'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ' రొమాంటిక్ సినిమా జీ5 లో స్ట్రీమింగ్!
మలయాళ సినిమాల క్రేజ్ ఓటీటీలో కొనసాగుతోంది!
కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఆప్ కైసే హో’
మలయాళ సినిమాలకు ఓటీటీలో ఉండే క్రేజే వేరు. డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగు ఫ్యాన్స్.. మలయాళ సినిమాలకు పట్టం కడుతుంటారు. స్టోరీ బాగుంటే చాలు తెగ చూసేస్తారు. ఇప్పుడు అలాంటి రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. మలయాళం సినిమాలు, సిరీస్ ఈ రోజు (జూన్ 20) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి ఏమిటంటే?
బ్యాచిలర్ పార్టీ నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ‘ఆప్ కైసే హో’. కడుపుబ్బా నవ్వంచే ఈ మలయాళ సినిమా శుక్రవారం నుంచి ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది. సన్ నెక్ట్స్ లో ఈ మూవీని చూడొచ్చు. ప్రధాన పాత్రలో ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ చిత్రంలో పెళ్లికి ముందు చేసుకునే బ్యాచిలర్ పార్టీ కారణంగా ఎలాంటి గందరగోళం తలెత్తిందనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. లైట్-హార్టెడ్ ప్రీ-వెడ్డింగ్ గందరగోళం నుండి తీవ్రమైన పోలీసు దర్యాప్తుల వరకు ఈ మలయాళం మూవీ మంచి కామెడీ అందిస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2’
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2
మలయాళంలో ఫస్ట్ వెబ్ సిరీస్ గా వచ్చిన కేరళ క్రైమ్ ఫైల్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సిరీస్ కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించే అవకాశముంది. కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లను పోలీసులు దాటే తీరు, మధ్యలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు, ఉత్కంఠను పెంచే సన్నివేశాలు ఇలా ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
రొమాంటిక్ కథ ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’
మోడర్న్ లవ్, రొమాన్స్ , ఫ్యామిలీ సంబంధాలను చాటే సినిమానే ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’. ఈ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కథ కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కోరికల మధ్య బ్యాలెన్స్ ను చక్కగా చూపిస్తోంది. హీరో జీవితం సోషల్ మీడియాలో అమ్మాయి నుంచి వచ్చే మ్యారేజీ ప్రపోజల్ తో మలుపు తీసుకుంటుంది. ఈ చిత్రం సంప్రదాయాల మార్పులను నావిగేట్ చేస్తున్న నేటి ప్రేక్షకులకు సమకాలీన అంశాలైన మ్యాచ్‌మేకింగ్ తదితర విషయాల గురించి చెప్తుంది.
మొత్తం మీద, ఈ మూడు చిత్రాలు విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని వెతుకుతూ ఉండండి!


