|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు – ఒక‌టి రొమాంటిక్ యాక్ష‌న్‌ – మ‌రోటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

Published: 30-04-2025, 3:12 AM
ఒకే రోజు ఒకే ఓటీటీలోకి వ‌చ్చిన రెండు తెలుగు సినిమాలు - ఒక‌టి రొమాంటిక్ యాక్ష‌న్‌ - మ‌రోటి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ‘సముద్రుడు’ అనే యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మరియు ‘రుద్రవీణ’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల విశేషాలేంటో చూద్దాం.

Key Points

1

అమెజాన్ ప్రైమ్‌లో రెండు తెలుగు సినిమాలు ఒకేసారి విడుదల.

2

‘సముద్రుడు’ సినిమాలో చేపల వ్యాపారం, దోపిడీల కథ.

4

రెండు సినిమాలు వేర్వేరు జానర్లలో ఆకట్టుకుంటాయి.

సముద్రుడు: యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్

బుధ‌వారం రోజు రెండు తెలుగు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వ‌చ్చాయి. రుద్ర‌వీణ‌తో పాటు స‌ముద్రుడు సినిమాలు ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీ లోకి వ‌చ్చాయి.

స‌ముద్రుడు మూవీలో ర‌మాకాంత్‌, అవంతిక‌, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో సుమ‌న్‌, స‌మ్మెట గాంధీ, జ‌బ‌ర్ధ‌స్థ్ శేషు కీల‌క పాత్ర‌లు పోషించారు. చేప‌ల వృత్తి జీవ‌నాధారంగా బ‌తికే మ‌త్య్స‌కారులు ద‌ళారుల కార‌ణంగా ఎలా దోపిడీల‌కు గురువుతున్నార‌నే సందేశానికి యాక్ష‌న్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు ఈ మూవీని రూపొందించాడు.

రుద్రవీణ: సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

గంగ స‌ముద్రంపై చేపలు ప‌ట్ట‌గా వ‌చ్చే డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేస్తుంటాడు. దేవ‌తో పాటు అల్లూర‌య్య అనే ద‌ళారులు త‌మ క‌ష్టాన్ని దోచుకుంటున్నార‌ని గ్ర‌హిస్తాడు గంగ‌. వారితో గొడ‌వ‌ప‌డ‌తాడు. గ‌జ‌ని మొహ‌మ్మ‌ద్ అనే రౌడీతో చేతులు క‌లిపిన దేవ‌…గంగ‌ను చంపాల‌ని చూస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది. ఆ ఊరికి టీచ‌ర్‌గా వ‌చ్చిన నందినిని గంగ ఎందుకు పెళ్లిచేసుకోవాల్సివ‌చ్చింది? గ‌జిని మొహ‌మ్మ‌ద్‌ను ఎదురించి గంగ ఎలాంటి పోరాటం సాగించాడు? గంగ‌కు అంజ‌లితో ఉన్న సంబంధం ఏమిటి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రుద్ర‌వీణ మూవీలో శ్రీరామ్ నిమ్మ‌ల‌, ఎల్సా ఘోష్‌, శుభ‌శ్రీ హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో ర‌ఘు కుంచె విల‌న్‌గా క‌నిపించాడు. మ‌ధుసూద‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీ లో 7.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఒకే రోజు ఓటీటీ విడుదల

లాల‌ప్ప యానంలో పెద్ద రౌడీ. త‌న అక్ర‌మ వ్యాపారాల‌కు అడ్డొచ్చిన వారిని దారుణంగా హ‌త‌మారుస్తుంటాడు. లాల‌ప్ప మ‌న‌షులు ఒక్కొక్క‌రుగా అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోతుంటారు. వారిని మ‌ర్డ‌ర్స్ చేస్తుంది రుద్ర అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. లాల‌ప్ప‌ను రుద్ర ఎందుకు టార్గెట్ చేశాడు. క్రికెట‌ర్‌గా ఐపీఎల్‌కు సెలెక్ట్ అయిన రుద్ర హంత‌కుడిగా జైలు పాలు కావ‌డానికి కార‌ణం ఏమిటి? రుద్ర జీవితంలోకి వ‌చ్చిన వీణ‌, ప్రియ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

చివరగా, రెండు వేర్వేరు జానర్ల సినిమాలు ఒకేసారి ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. సముద్రుడు, రుద్రవీణ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా అనేది చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.