|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

UBSFirstSingle : ఈ వీడియో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది, ఉస్తాద్ ఫస్ట్ సాంగ్ పై స్పెషల్ వీడియో

Published: 11-12-2025, 8:48 AM
UBSFirstSingle : ఈ వీడియో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది, ఉస్తాద్ ఫస్ట్ సాంగ్ పై స్పెషల్ వీడియో
  • పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • ‘UBSFirstSingle’ పాటను విశాల్ దద్లానీ పాడారు, డిసెంబర్ 13న విడుదల కానుంది.
  • విశాల్ దద్లానీ ఈ పాట అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
  • గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి మొదటి సింగిల్ ‘UBSFirstSingle’ డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ పాటపై విశాల్ దద్లానీ స్పందిస్తూ, ఇది అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ స్పెషల్ వీడియో పూర్తి వివరాలు అందిస్తుంది.

ఉస్తాద్ భగత్ సింగ్: అభిమానుల అంచనాలు

UBSFirstSingle : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కలగడానికి కారణం మొదట కాంబినేషన్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలో ఉండటం సహజంగా జరుగుతుంది. గబ్బర్ సింగ్ సినిమా ఎంత సక్సెస్ సాధించింది అనేది కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డ్స్ అన్నీ కూడా ఒక రీమేక్ సినిమా వచ్చి చెరిపేసింది.

అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు మామూలువి కావు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అప్పట్లో బీభత్సమైన వైరల్. బాగుంటే హిట్ అంటారు. ఇంకా బాగుంటే సూపర్ హిట్ అంటారు. చాలా బాగుంటే బ్లాక్ బస్టర్ అంటారు. దాన్ని మించి ఉంటే గబ్బర్ సింగ్ అంటారు.

అని ట్వీట్ చేయడం మాత్రమే కాకుండా, దబాంగ్ సినిమా కంటే 100 రెట్లు బాగుంది అని వీడియోలో కూడా చెప్పాడు. అటువంటి కాంబినేషన్ లో ఇప్పుడు మళ్లీ సినిమా వస్తుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ 13వ తారీఖున విడుదల కానుంది. ఈ తరుణంలో దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయిపోయింది. అయితే ఈ పాటను విశాల్ డెడ్లని పాడారు. ఇండియన్ ఐడల్ షో కి న్యాయ నిర్ణయితగా ఈయన వ్యవహరిస్తూ ఉంటారు.

‘UBSFirstSingle’పై విశాల్ దద్లానీ స్పందన

కొద్దిసేపటి క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ గురించి విశాల్ ఇచ్చిన రియాక్షన్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ కు ఎవరు డాన్స్ వేయకుండా ఉండలేరు. సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. అన్ని రికార్డ్స్ కూడా ఈ సాంగ్ తో బద్దలై పోతాయి నన్ను నమ్మండి అంటూ విశాల్ రియాక్ట్ అయ్యాడు. వారి విశాల్ మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది 13 వ తారీఖున తెలుస్తుంది.

THIS SONG CAN MAKE ANYONE DANCE 🔥🔥

The energy of @harish2you , @ThisIsDSP and @vishaldadlani from the song recording session says it all 💥💥 #DekhlengeSaala out on December 13th ❤‍🔥

Song Promo ▶️ https://t.co/FFMiAPrt2Z #UBSFirstSingle 🕺🏻🔥 #UstaadBhagatSingh POWER STAR… pic.twitter.com/WwB5OhvKE2

డిసెంబర్ 13న పాట విడుదల: అంచనాలు

— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2025

మరోవైపు ఈ సినిమాలో పవర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ డిజైన్ చేసినట్లు దేవిశ్రీప్రసాద్ ఇదివరకే జగపతిబాబుతో జరిగిన ఒక షోలో రివిల్ చేసేసాడు. అయితే ప్రోమో వీడియో చూసిన తర్వాత అభిమానులకు కూడా కొంత మేరకు క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైపోయింది.

మరోవైపు చిన్న ప్రోమో వీడియో చూస్తేనే పవన్ కళ్యాణ్ అంత ఫాస్ట్ గా ఎలా డాన్స్ చేశారు.? అలా డాన్స్ చేయటానికి హరీష్ శంకర్ ఏమని రిక్వెస్ట్ చేశాడు. అని చాలామందికి కొన్ని రకాల ఆలోచనలు మొదలైపోయాయి.

మొత్తంగా, ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సింగిల్ ‘UBSFirstSingle’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ దద్లానీ, దేవిశ్రీప్రసాద్ మాటలు ఈ పాట ప్రత్యేకతను మరింత పెంచాయి. డిసెంబర్ 13న విడుదల కానున్న ఈ పాట నిజంగా రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.