|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వివరణ: అసలు ఏం జరిగింది?

Published: 15-05-2026, 6:30 AM
సనాతన ధర్మంపై ఉదయనిధి సంచలన వివరణ: అసలు ఏం జరిగింది?
  • సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలు కులవ్యవస్థ నిర్మూలనకే అని ఉదయనిధి స్టాలిన్ వివరణ.
  • ప్రజలను కులాలుగా విభజించే వ్యవస్థకు మాత్రమే తాను వ్యతిరేకమని స్పష్టీకరణ.
  • దేవాలయాల్లోకి వెళ్లొద్దని తన వ్యాఖ్యల ఉద్దేశం కాదని ఉదయనిధి వెల్లడి.
  • పెరియార్, అంబేద్కర్, కరుణానిధి సిద్ధాంతాలను ప్రస్తావించిన ఉదయనిధి.

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కులవ్యవస్థ నిర్మూలనే తన లక్ష్యమని, ప్రజలను విభజించే వ్యవస్థకు మాత్రమే తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దేవాలయాలకు వెళ్లొద్దని తన ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై మళ్లీ దుమారం

డీఎంకే శాసన సభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ప్రజలను కులాలుగా విభజించే వ్యవస్థకు మాత్రమే తాను వ్యతిరేకమని, దేవాలయాల్లోకి వెళ్లొద్దని తన వ్యాఖ్యల ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కులవ్యవస్థను నిర్మూలించడమంటే ఆలయాల్లోకి వెళ్లొద్దని అర్థం కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలనేదే తన ఉద్దేశ్యమన్నారు.

గతంలో తమిళనాడు అసెంబ్లీలో తాను మాట్లాడినపుడు.. ప్రజలను విభజించే కులవ్యవస్థను అంతమొందించాలని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తనపై విమర్శలు చేస్తున్నారని, దేనికీ తాను భయపడే వ్యక్తిని కానన్నారు. ద్రవిడ ఉద్యమం పుట్టిందే ప్రతిఘటన నుంచి అని.. ఆ కోణంలోనే చిన్న వివరణ ఇస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు. ప్రజల్ని అగ్రకులాలు, తక్కువ కులాలుగా విభజించి చూసే వ్యవస్థను అంతమొందించాలని తాను కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు. పెరియార్, అంబేద్కర్, అన్నాదురై, కరుణానిధి బోధించిన సిద్ధాంతాల గురించే మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. దేవుడిపై ఎవరి నమ్మకాలకూ తాము వ్యతిరేకం కాదని, అసమానతలు, అణచివేతను మాత్రం సహించబోమని పేర్కొన్నాదు. కాగా.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంలో.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కులవ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: ఉదయనిధి

పెరియార్, అంబేద్కర్ సిద్ధాంతాల ప్రస్తావన

ఉదయనిధి స్టాలిన్ వివరణతో సనాతన ధర్మం వివాదం కొత్త మలుపు తిరిగింది. కులవ్యవస్థ నిర్మూలనపై ఆయన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.