|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫైర్! ఏమన్నారంటే?

Published: 29-05-2026, 5:46 PM
సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫైర్! ఏమన్నారంటే?
  • ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  • యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
  • సనాతన ధర్మం మతం కాదని, అది భారతీయ జీవన విధానమని అర్జున్ స్పష్టం చేశారు.
  • తల్లిదండ్రులను తిరస్కరించలేనట్లే సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేమని అర్జున్ అన్నారు.

సనాతన ధర్మంపై తమిళ యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వివాదంపై యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్పందిస్తూ, సనాతన ధర్మం ఒక మతం కాదని, అది జీవన విధానమని, దానిని ఎవరూ తిరస్కరించలేరని సంచలన కామెంట్స్ చేశారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ

Sanatana Dharma: సనాతన ధర్మం అనే పదం ఇపుడు నేషనల్ వైడ్ గా ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.ఒకరకంగా చెపాలంటే గత కొన్ని రోజులుగా దేశంలోని రాజకీయాలన్ని దీని చుట్టే తిరుగుతున్నాయ్.ఇక తమిళ నాట డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్  ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చడం, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు కోల్పోవడం తెల్సిందే.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన మాత్రం తన పంథా మార్చుకోకుండా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెన్సేషన్ కామెంట్స్ చేసిన అర్జున్

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ వివాదంపై స్పందిస్తూ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ పేరు నేరుగా ఎత్తకపోయినా, ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చేలా అర్జున్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ కామెంట్లే ఇపుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.

యాక్షన్ కింగ్ అర్జున్ సంచలన స్పందన

Actor Arjun Sarja absolutely roasts Udhayanidhi Stalin.

He says Sanatan Dharma is a way of life that teaches us how to live and to treat parents like gods.

“So can you reject your own parents?” “No.”

“Likewise, Sanatan can never be rejected or erased.” pic.twitter.com/gOdAAIkYvY

సనాతన ధర్మంపై అర్జున్ అభిప్రాయం

— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) May 28, 2026

అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్లాస్ట్’ ఇటీవల మే 28న తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదలైంది. వైవిధ్యమైన యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా . ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శుక్రవారం చెన్నైలో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో సినిమా విశేషాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  కొన్ని ప్రశ్నలు అడిగింది మీడియా.అందులో భాగంగానే సనాతన ధర్మం నిర్మూలనపై జరుగుతున్న డిబేట్ గురించి ప్రస్తావించగా అర్జున్ చాలా హుందాగా, అంతే స్ట్రాంగ్‌గా సమాధానమిచ్చారు.

సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని, అది ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి జీవన విధానమని అర్జున్ స్పష్టం చేశారు. సమాజంలో ఎలా బతకాలి, తోటి వారితో ఎలా నడుచుకోవాలి, కన్న తల్లిదండ్రులను మరియు దేవుళ్లను ఎలా గౌరవించాలో నేర్పేదే సనాతన ధర్మమని ఆయన వివరించారు. ఎవరైనా తమ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా లేదా వారిని వదిలేసి బతకగలరా అని ప్రశ్నించారు. అది ఎలాగైతే సాధ్యం కాదో, సనాతన ధర్మాన్ని కూడా ఈ భూమ్మీద నుంచి ఎవరూ తుడిచివేయలేరని, దాన్ని తిరస్కరించడం ఎవరి తరం కాదని గట్టిగా చెప్పారు. ఒక సంస్కృతిని, జీవన విధానాన్ని రోగాలతో పోల్చడం సరికాదనే అర్థం వచ్చేలా అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.చూడాలి మరి వీటికి స్టాలిన్ నుండి ఎలాంటి కౌంటర్ వస్తుందో !

మొత్తంగా, ఉదయనిధి వ్యాఖ్యలపై అర్జున్ సర్జా స్పందన సనాతన ధర్మంపై జరుగుతున్న చర్చకు కొత్త కోణాన్ని ఇచ్చింది. ఇది కేవలం మతం కాదని, భారతీయ జీవన విధానమని ఆయన మాటలు స్పష్టం చేశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.