
📌 Key Points
- బాలకృష్ణ అఖండ 2 ప్రమోషన్లలో భాగంగా వారణాసిని సందర్శించారు.
- ఆలయం వద్ద హిందీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
- అఖండ 2 కేవలం తెలుగు చిత్రం కాదని, భారతీయ సినిమా అని ప్రకటించారు.
- సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం, కాపాడుకోవడంపై బాలయ్య ఉద్ఘాటించారు.
నటసింహం బాలకృష్ణ ‘అఖండ 2’ ప్రచారంలో భాగంగా వారణాసిని సందర్శించి సంచలనం సృష్టించారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అనంతరం ఆయన హిందీలో ప్రసంగించారు. ‘అఖండ 2’ కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయ సినిమా అని పేర్కొంటూ సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరించారు.
బాలయ్య వారణాసి పర్యటన, అఖండ 2 ప్రచారం
Balakrishna: బాలకృష్ణ తాజాగా అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలకృష్ణ(Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati sreenu)కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినిమా పట్ల భారీ అంచనాలు ఉంటాయి. ఇక అఖండ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 పట్ల కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పాలి. ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణతో పాటు అఖండ చిత్ర నిర్మాతలు వారణాసిలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.
అఖండ 2 సినిమా విడుదలకు ముందు కూడా పలు ఆలయాలను చిత్ర బృందం సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక స్వామివారి దర్శనం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అయితే ఈయన హిందీలో మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అఖండ తాండవం సినిమా కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదని ఇది భారతీయ సినిమా అని తెలిపారు.
అఖండ 2 ‘భారతీయ’ సినిమా: బాలకృష్ణ
ఈ సినిమాలో తాను సనాతన సైనికుడిగా నటించానని, సనాతన ధర్మం గురించి నేటితరం తెలుసుకోవాల్సి ఉందని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియచేశారు. అఖండ 2 సినిమా గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా వివరించామని బాలకృష్ణ తెలిపారు. అఖండ తాండవం సినిమాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని ఈ సందర్భంగా ఈ సినిమా గొప్పదనం గురించి బాలకృష్ణ హిందీలో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక అఖండ 2 సినిమాకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలోనే వారణాసి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు..
ఇక బాలకృష్ణ వెంట దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఒక పాత్రలో ఎమ్మెల్యేగా కనిపించగా మరొక పాత్రలో అఘోరిగా కనిపించి సందడి చేశారు. ఇలా ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహిస్తూ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచారు కానీ విడుదలైన తర్వాత అనుకున్న స్థాయిలో సినిమా లేకపోవడంతో కాస్త నిరాశ ఎదురయింది. ఇక అఖండ యూనివర్స్ నుంచి మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు జై అఖండ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు చిత్ర బృందం హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమా మరి కాస్త ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
సనాతన ధర్మంపై బాలయ్య ప్రసంగం
బాలకృష్ణ వారణాసి పర్యటన, హిందీ ప్రసంగం ‘అఖండ 2’ సినిమాకు మరింత ప్రాచుర్యం కల్పించాయి. ఈ చిత్రం కేవలం వినోదమే కాకుండా సనాతన ధర్మ సందేశాన్ని ఇస్తుందని బాలయ్య స్పష్టం చేశారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


