|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉగాదికి టాలీవుడ్ vs బాలీవుడ్ ఫైట్! పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టిస్తాడా? రికార్డులు బద్దలు కావాల్సిందే!

Published: 13-03-2026, 3:06 AM
ఉగాదికి టాలీవుడ్ vs బాలీవుడ్ ఫైట్! పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టిస్తాడా? రికార్డులు బద్దలు కావాల్సిందే!
  • ఉగాదికి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల, భారీ అంచనాలు!
  • బాలీవుడ్ చిత్రం ‘దురంధర్ 2’తో పవన్ కళ్యాణ్ పోటీ!
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటలు, టీజర్ ఆశించిన స్థాయిలో లేవు
  • ‘దురంధర్ 2’ మొదటి భాగం రూ.1300 కోట్లు వసూలు చేసింది!

టాలీవుడ్లో ఉగాది సందడి మొదలైంది! ఈసారి పవన్ కళ్యాణ్ తన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి గట్టి పోటీ ఇవ్వనున్నాడు. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

ఉగాది బరిలో పవన్ కళ్యాణ్ వర్సెస్ రణవీర్ సింగ్!

టాలీవుడ్‌లో సంక్రాంతి, దసరా, దీపావళి టైమ్‌లో ఎక్కువగా సినిమాల మధ్య పోటీ ఉంటుంది. మామూలు పండగల సమయంలో అంత పోటీ ఉండదు. ఇప్పుడు త్వరలో ఉగాది రాబోతుంది.  ఈ ఉగాదికి సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడూ చర్చకురాదు. కానీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. కారణం టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ గా మారింది. రణ్‌వీర్‌ సింగ్‌తో పవన్‌ కళ్యాణ్‌ ఢీ కొంటున్నాడు. అయితే ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తన పవర్‌ చూపించే టైమ్‌ వచ్చింది.

వచ్చే వారం ఉగాది పండగ ఉంది. మార్చి 19(గురువారం)న మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మనకు ఇక్కడ పెద్ద పండగే అని చెప్పొచ్చు. ఈ ఉగాదిని పురస్కరించుకుని తెలుగు నుంచి ఒకే ఒక్క సినిమా విడుదలవుతుంది. అదే పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. `గబ్బర్‌ సింగ్‌` తర్వాత పవన్ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. దీంతో ఈ కాంబోపై మంచి అంచనాలున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజ్ తగ్గిందా?

ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ లు, టీజర్‌ విడుదలయ్యాయి. మూడు పాటలు బయటకొచ్చాయి. పాటలుగానీ, గ్లింప్స్ లుగానీ బజ్‌ క్రియేట్‌ చేయలేకపోయాయి. పవన్‌ కళ్యాణ్‌ మూవీస్‌లో అత్యంత బజ్‌ లేని చిత్రం ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పొచ్చు. డిజాస్టర్‌గా నిలిచిన `హరి హర వీరమల్లు`కి సైతం మంచి బజ్‌ ఏర్పడింది. కానీ ఈ మూవీని ఎవరూ పట్టించుకోవడం లేదు. పవన్‌ చివరగా `ఓజీ` చిత్రంలో నటించారు. ఇది బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత వస్తోన్న మూవీ అన్నప్పుడు ఆటోమెటిక్‌గా బజ్‌ ఉంటుంది. అభిమానుల హడావుడి ఉంటుంది. బిజినెస్‌ పరంగానూ ఆ జోరు ఉంటది. కానీ `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`కి మాత్రం అలాంటి క్రేజ్‌ కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి పవన్‌ కళ్యాణ్‌ తన పవర్‌ని చూపించాల్సిన టైమ్‌ వచ్చింది. తన క్రేజ్‌ని చాటి చెప్పాల్సిన టైమ్‌ వచ్చింది.

ఇక ఉగాది పండగ సందర్భంగా విడుదల కాబోతున్న మరో మూవీ `ధురంధర్‌ 2`. రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన బాలీవుడ్‌ చిత్రమిది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు. సంజయ్‌ దత్‌, ఆర్‌ మాధవన్‌, అక్షయ్‌ ఖన్నా, సారా అర్జున్‌ వంటి వారు నటించారు. ఈ మూవీకి సంబంధించి మొదటి భాగం ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1300కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. మార్చి 19న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఇది రిలీజ్‌ కాబోతుంది.  ఈ మూవీ కోసం ఇండియన్‌ ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

దురంధర్ 2 తో బాలీవుడ్ సత్తా చాటుతుందా?

`ధురంధర్‌ 2` మూవీ కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తుండటం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కంటే `ధురంధర్‌ ది రివేంజ్‌` గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే ఉండబోతుంది. అది `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పవన్‌ మూవీకి గట్టి దెబ్బ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు పవన్‌ తన పవర్‌ని చూపించాల్సిన టైమ్‌ వచ్చింది. మరి ఈ భారీ పోరులో గెలుపెవరిది అనేది చూడాలి. వచ్చే గురువారం బాక్సాఫీసు ఫైట్‌ ఆసక్తికరంగా ఉండబోతుందని చెప్పొచ్చు.

ఉగాదికి విడుదల కాబోయే ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, రణవీర్ సింగ్ లలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.