
📌 Key Points
- ఉపాసన ఎమోషనల్ వీడియో విడుదల: అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగం!
- కవలల సంరక్షణలో అపోలో హాస్పిటల్స్ సహకారం: వైద్యుల సేవలకు ఉపాసన ప్రత్యేక ధన్యవాదాలు.
- చిరంజీవి కుటుంబంలో కొత్త సంతోషాలు: కవల పిల్లల రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు.
- రాంచరణ్, ఉపాసనల అన్యోన్యత: ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాలు వైరల్!
మెగా కోడలు ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపాసన కన్నీటి పర్యంతం.. వీడియో వైరల్!
మెగా కోడలు ఉపాసన కొణిదెల ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చింది. జనవరి 31న రాంచరణ్, ఉపాసన దంపతులు ఆడ, మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. రాంచరణ్ ఉపాసన దంపతులకు తొలి సంతానంగా క్లీంకార 2023లో జన్మించింది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలిలో మరో ఇద్దరు మెంబర్స్ జాయిన్ అయ్యారు.
కవల పిల్లలు పుట్టాక ఉపాసన కొణిదెల తొలిసారి తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన డెలివరీ ప్రాసెస్.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి కవలలు జన్మించి ఫ్యామిలీ, అభిమానులు సంబరాలు చేసుకునే వరకు జరిగిన పరిణామాలని ఆమె వీడియో రూపంలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో రాంచరణ్ తన సతీమణి ఉపాసనని అపోలో ఆసుపత్రికి తీసుకెళుతున్న దృశ్యాలు, ఉపాసన డెలివరీకి డాక్టర్స్ టీం చేస్తున్న ఏర్పాట్లు చూపించారు. అదే విధంగా ఉపాసన పర్సనల్ ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్యుడు మహేష్ బాంగ్ చెబుతున్న మాటలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
ట్విన్స్ తో మెగా ఇంట సంబరాలు..!
Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU My family is truly blessed. Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9
— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026
అపోలో హాస్పిటల్స్‌కు ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
అదే విధంగా అపోలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కె సుబ్బారెడ్డి చెబుతున్న వివరాలు కూడా ఉన్నాయి. ఉపాసన సేఫ్ డెలివరీ కోసం అపోలో ఆసుపత్రిలో 2 డాక్టర్ల బృందాలు పనిచేసినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ లతా మాట్లాడుతూ తప్పకుండా ఒత్తిడి ఫీల్ అయ్యా. ఎందుకంటే ఉపాసన సేఫ్ డెలివరీ కావడం, వారికి ఆరోగ్యకరమైన పిల్లలను అందించడం నా రెస్పాన్సిబిలిటీ అని తెలిపారు.
ఉపాసన కవలలకు జన్మనిచ్చిన తర్వాత చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి ఆ శుభవార్తని పంచుకున్న మాటలు చూపించారు. అదే విధంగా చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు తన సంతోషాన్ని తెలియజేస్తున్న మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. ఉపాసన..స్పందిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి సారీ.. నా గుండె నిండిపోతోంది. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా. అపోలో ఆసుపత్రి టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు. రాంచరణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఉపాసన ఎమోషనల్ వీడియో మెగా అభిమానులను కదిలించింది. కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


