|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఉప్పల్ బాలు కోసం క్యూ కడుతున్నారు! మాస్ స్టోరీ ఇది!

Published: 12-04-2026, 4:05 AM
షాకింగ్: అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు ఉప్పల్ బాలు కోసం క్యూ కడుతున్నారు! మాస్ స్టోరీ ఇది!
  • టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఉప్పల్ బాలు, విమర్శలు ఎదుర్కొన్నా ఫాలోయింగ్ తగ్గలేదు.
  • కుటుంబ పోషణ కోసం ఎన్నో కష్టాలు పడిన బాలు, నేడు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.
  • ఒకప్పుడు ఇంటికి రావద్దన్న వారే, ఇప్పుడు బాలు కోసం ఎదురు చూస్తున్నారట.
  • హియ్యా మండి టీమ్ తో కలిసి ప్రమోషన్స్ చేస్తున్న బాలు, ఫుల్ బిజీగా ఉన్నాడు.

టిక్ టాక్ వీడియోలతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఉప్పల్ బాలు జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు అవమానించిన వారే ఇప్పుడు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే!

టిక్ టాక్ నుంచి సెలబ్రిటీగా బాలు ప్రస్థానం!

టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు.. ఎంత పాపులర్ అయ్యాడో అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు. బోల్డ్ కంటెంట్ తో వీడియోలు చేయడం, బాలు బాడీ లాంగ్వేజ్ నచ్చక చాలామంది అతన్ని విమర్శించేవారు. ఎంత విమర్శించినా.. అంతకు రెట్టింపు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. పేదరికం నుంచి వచ్చిన బాలు.. కుటుంబాన్ని పోషించడానికి రకరకాల వేశాలు వేసేవాడు. ఎవరు ఎన్ని అన్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. వందకి వెయ్యికి ప్రమోషన్లు చేశాడు. కుటుంబాన్ని పోషించాడు. ఆతరువాత కాలంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది.

ఉప్పల్ బాబు టిక్ టాక్ వీడియోలు, వింత వేశాలు వేస్తున్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు కూడా బాలుతో సరిగ్గా మాట్లాడేవారు కాదట. బంధువులు అయితే దగ్గరకు కూడా రానివ్వలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బాలు. చిన్న తనం నుంచి తన కుటుంబంలో మేనమామలు, బాబాయిలు ఎంతో ప్రేమగా ఉండేవారని.. వారి ఇంట్లో ఏం జరిగినా తన సందడే ఎక్కువగా ఉండేదని బాలు అన్నాడు. అంతే కాదు టిక్ టాక్ వీడియోలు మొదలు పెట్టినప్పటి నుంచి బయటివారికంటే బంధువులే తనను దూరం పెట్టారని బాలు బాధపడ్డాడు. ఇంటికి రావద్దని చెప్పేశారట. ఎదురు పడితే ముఖం తిప్పుకుని వెళ్లేవారట. ఇంట్లో పెళ్లిల్లు ఫంక్షనస్ కు కూడా పిలవడం మానేశారని బాలు ఓ సందర్భంలో వెల్లడించాడు.

కుటుంబం దూరం పెట్టినా.. వెనక్కి తగ్గని బాలు!

కానీ ఇప్పుడు బాలు పూర్తిగా మారిపోయాడు కూల్ గా కామ్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. పిచ్చి పిచ్చి అరుపులు లేవు, వింత వేశాలు కూడా లేవు.. బుద్దిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెద్దగా మాట్లాడటంలేదు. కామ్ గా ఉంటున్నాడు. నిదానంగా సమాధానం చెపుతున్నాడు. బాలు మాట్లాడుతూ.. ”ఒకప్పుడు నన్ను వద్దన్న వారు.. నేను ఫేమస్ అయ్యాక నా కోసం వెతుకుంటున్నారు.. ఇంటికి రమ్మని బ్రతిమలాడుతున్నారు.

కానీ నేను రాను అని వారికి చెప్పేశాను. అప్పుడు నా దగ్గర డబ్బులేదు. కానీ ఇప్పుడు డబ్బుతో పాటు.. ఇమేజ్ కూడా ఉంది. అందుకే రమ్మని పిలుస్తున్నారు. కానీ మొదటి నుంచి నన్ను అర్ధం చేసుకుని.. నాతో ఉన్నవారే.. ముందు ముందు కూడా నాతోనే ఉంటారు. వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడమే నా టార్గెట్” అని బాలు ఓఇంటర్వ్యలో వెల్లడించారు.

ఇప్పుడు బాలు లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసా?

సోషల్ మీడియా స్టార్ గా ఉన్న బాలుని హియ్యా మండి టీమ్ దగ్గరకు తీసింది. ఆ కంపెనీకి బాలు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఆ టీమ్ లీడర్ గౌతమి బాలుతో ప్రమోషన్లు చేయించుకుంటూ.. రకరకాల థీమ్స్ తో బాలుని బిజీ చేశారు. అంతే కాదు కంటీన్యూగా ఆ కంపెనికి పనిచేసినందుకు నెలకు లక్ష రూపాయల వరకూ జీతం కూడా ఇస్తున్నారు. బాలు గౌరవంగా బ్రతికేలా దారి చూపించారు.

దాంతో బాలు కూడా గతంలో మాదిరిగా పిచ్చి పిచ్చి వీడియోలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అరుపులు కేకలు లేకుండా కామ్ గా తన పని తాను చేసకుంటూ వెళ్తున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నాడు. ఖాళీటైమ్ లో ఈవెంట్లు కూడా చేసుకుంటున్నాడు. గతంలో లా తాను పిచ్చి వీడియోలు చేస్తే.. నన్ను నమ్మి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాడమ్ కు పేరు వస్తుంది అందుకే ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయాను అని బాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

ఉప్పల్ బాలు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సక్సెస్ తో అందరికీ సమాధానం చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.