|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Urvashi Rautela: పాపం.. ఊర్వశి.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షలు ఫట్!

Published: 31-07-2025, 9:45 AM
Urvashi Rautela: పాపం.. ఊర్వశి.. మ్యాచ్ కోసం వెళ్తే రూ.70 లక్షలు ఫట్!

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో తన రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కోల్పోయింది. విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె ప్రశ్నించింది. ఈ సంఘటన ప్రస్తుతం వార్తల్లో చక్కర్లు కొడుతోంది.

Key Points

1

ఊర్వశి రౌతేలా లండన్ గాట్విక్ విమానాశ్రయంలో రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కోల్పోయింది.

2

ఆమె లగ్జరీ సూట్‌కేస్‌తో పాటు టికెట్ వివరాలు కూడా దొంగిలించబడ్డాయి.

4

ఈ సంఘటనను ఊర్వశి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

లండన్ విమానాశ్రయంలో ఊర్వశికి చేదు అనుభవం

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది . ఇటీవల వింబుల్డన్ ‌ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది . లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది . దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ సూట్‌కేస్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊ ‍ ర్వశి నిరాశ వ్యక్తం చేసింది.

రూ.70 లక్షల విలువైన ఆభరణాలు చోరీ

ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ . ఈ సంఘటనను వివరిస్తూ విమానాశ్రయంలో భద్రతా లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్ ‌ కు గ్లోబల్ ఆర్టిస్ట్ ‌ గా హాజరైనట్లు వెల్లడించింది . ముంబయి నుంచి గాట్విక్ ‌ చేరుకోగా .. ఎయిర్ ‌ పోర్ట్ ‌ లో తన బ్యాగ్ దొంగిలించారని పోస్ట్ చేసింది . బ్యాగ్ ‌ తో పాటు టికెట్ ‌ వివరాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది . త్వరగా తన బ్యాగ్ ‌ తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది . కానీ అక్కడి అధికారుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయింది .

విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యం?

కాగా .. ఈ బాలీవుడ్ ముద్దుగమ్మ సినిమాలతో పాటు ప్రత్యేక సాంగ్స్ ‌ తో అభిమానులను అలరించింది . టాలీవుడ్ ‌ లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించింది . బాలయ్య , మెగాస్టార్ ‌ సినిమాల్లోనూ కనిపించింది .

ఊర్వశి రౌతేలా లండన్‌లో ఎదుర్కొన్న ఈ దారుణ సంఘటన చాలా బాధాకరం. విమానాశ్రయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఈ ఘటన ప్రజలను కలవరపెడుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.