|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ.1,491 కోట్ల డ్రెస్సులో ఊర్వశి రౌతేలా.. కేన్స్ లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ బ్యూటీ!

Published: 13-05-2026, 4:45 PM
రూ.1,491 కోట్ల డ్రెస్సులో ఊర్వశి రౌతేలా.. కేన్స్ లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ బ్యూటీ!
  • కేన్స్ 2026లో ఊర్వశి రౌతేలా రూ.1,491 కోట్ల డ్రెస్సుతో రికార్డు సృష్టించింది.
  • వియత్నాం బ్రాండ్ ‘జోలిపొలి కోచర్’ ఊర్వశి కోసం ఈ ప్రత్యేక గౌనును డిజైన్ చేసింది.
  • ఆమె తలపై ధరించిన డేగ ఆకృతి హెడ్‌పీస్, చేతిలోని బుల్లి బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • ఈ మొత్తం లుక్ డిజైన్ చేయడానికి అక్షరాలా ఎనిమిది నెలల సమయం పట్టింది.

కేన్స్ 2026 చలన చిత్రోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్. దాదాపు రూ.1,491 కోట్ల విలువైన ఈ అవుట్‌ఫిట్ తో ఊర్వశి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్, దాని వెనుక ఉన్న కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది.

కేన్స్ లో ఊర్వశి రౌతేలా సంచలనం

Urvashi Cannes : మే 12న గ్రాండ్ గా మొదలైన ప్రారంభమైన కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (Cannes 2026) వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ స్టార్ అలియా భట్ తన సింప్లిసిటీతో రెడ్ కార్పెట్‌పై మ్యాజిక్ చేయగా, తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా వేసుకున్న డ్రెస్ తోనే నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కారణం డిజైన్ తో కాదండోయ్ ..దానికున్న రేటుతో.అవును … ఆ కాస్ట్ కాని మీరు విన్నారంటే నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే.

యస్ .విషయంలోకి వెళ్తే ..వియత్నాంకు చెందిన వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్ ‘జోలిపొలి కోచర్’ఊర్వశి కోసం ఒక స్పెషల్ గౌన్ ని డిజైన్ చేసింది. బ్లూ కలర్ లో దగ దగ మెరిసిపోతున్న ఈ డ్రెస్సులో ఊర్వశి నిజంగానే అప్సరస లాగే ఉంది. అయితే ముఖ్యంగా ఆమె తలపై ధరించిన డేగ ఆకృతిలో ఉన్న హెడ్‌పీస్, చేతిలోని బుల్లి బ్యాగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయ్.ఇక ఈ మొత్తం లుక్‌ను డిజైన్ చేసి డ్రెస్ గా మార్చడానికి పట్టిన టైమ్ ఎంతో తెలుసా.. అక్షరాలా ఎనిమిది నెలలు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

డ్రెస్ ధర రూ.1,491 కోట్లు ఎలా?

అటు ఇటుగా 1,491 కోట్ల రూపాయలకు పైమాటే

ఇక అసలు విషయానికొస్తే.. ఈ లుక్ కాస్ట్ ఇపుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో డిబేట్ కి దారి తీస్తుంది. ఎందుకంటారా..ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఊర్వశి ధరించిన ఈ అవుట్‌ఫిట్ కాస్ట్ దాదాపుగా 155.87 మిలియన్ డాలర్లని టాక్ అంటే మన భారతీయ కరెన్సీలో కాస్త అటు ఇటుగా 1,491 కోట్ల రూపాయలకు పైమాటే అన్న మాట.దీంతో కేన్స్ చరిత్రలోనే ఇంతటి భారీ విలువైన దుస్తులు ధరించిన నటిగా ఊర్వశి రికార్డు సృష్టించిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ గా ఎవరూ రెస్పాండ్ కాకపోయినా , ఆమె లుక్ మాత్రం మిలియన్ డాలర్ల రేంజ్‌లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

అప్సరసలా మెరిసిన బాలీవుడ్ బ్యూటీ

ఇక అమ్మడి సినిమా సంగతులకొస్తే ..’సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి, ఆ తర్వాత ‘సనమ్ రే’, ‘హేట్ స్టోరీ 4’ వంటి చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది.ఇక ఆమధ్య తెలుగులో ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టిన ఈ బీ టౌన్ బ్యూటీ డాకు మహారాజ్ లో బాలయ్య పక్కన డబిది దిబిడి అంటూ ఎలా దంచికొట్టిందో తెల్సిందే. మొత్తానికి ఈ అందాల భామ అటు సినీఇండస్ట్రీని.ఇటు ప్యాషన్ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో షేక్ చేస్తుందన్న మాట.

ఊర్వశి రౌతేలా కేన్స్ లో ధరించిన ఈ అద్భుతమైన డ్రెస్ కేవలం ఫ్యాషన్ ప్రకటన మాత్రమే కాదు, ఒక రికార్డు. ఆమె అందం, ఈ డ్రెస్ విలువ సినీ, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.