
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వారం రోజుల్లో రూ. 77 కోట్ల వసూళ్లు రాబట్టింది – ట్రేడ్ వర్గాల అంచనా!
- పవన్ కళ్యాణ్ డాన్సులు, కామెడీతో అదరగొట్టారు, కానీ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.
- హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఉగాదికి విడుదలైంది.
- భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 35 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మొదటి వారం వసూళ్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. అభిమానులకు పండుగలాంటి ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం.
వారం రోజుల్లో ఉస్తాద్ కలెక్షన్ల సునామీ!
పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ 9 నెలల్లోనే మూడు సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. ఇందులో `హరి హర వీరమల్లు` మూవీ డిజప్పాయింట్ చేసింది. `ఓజీ` బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదలైన విషయం తెలిసిందే.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై దర్శకుడు రిలీజ్‌కి ముందే క్లారిటీ ఇచ్చారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పారు. కమర్షియల్ సినిమాలు వచ్చి చాలా కాలం అవుతుందని, ఆ లోటుని ఇది భర్తీ చేస్తుందన్నారు. అన్నట్టుగానే సినిమా ఉంది. రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా నిలిచింది. అయితే రొటీన్ సినిమాగా ఇది నిలవడమే ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డాన్సులు చేశాడు, కామెడీ చేశాడు, ఇతర హీరోల సినిమాల పాటలకు డాన్సులు కూడా చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే తన సినిమాలోని హిట్ పాటలని రీమిక్స్ చేశారు. ఆయా సీన్లు మెప్పించినా, సినిమాలో కొత్తదనం లేకపోవడం, ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో దీనికి నెగటివ్ టాక్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ మేనియా: బాక్సాఫీస్ షేక్!
అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా ఈ మూవీ ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది. ఓపెనింగ్స్ భారీగా తగ్గాయి. అభిమానులు తప్ప, కామన్ ఆడియెన్స్ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో బాక్సాఫీసు వద్ద నీరసమైన ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లని రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా ఎంత రాబట్టాలి అనేది చూస్తే.
`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ వారం(7) రోజుల్లో దాదాపు రూ.77కోట్లని వసూలు చేసింది. ఇండియాలో ఈ వసూళ్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.88కోట్లు వచ్చినట్టు ట్రేడ్ సైట్లు వెల్లడించాయి. ఇండియాలో రూ.65కోట్ల నెట్‌ని, ఓవర్సీస్‌లో రూ.11కోట్ల కలెక్షన్లని రాబట్టింది. మొదటి రోజు రూ.35కోట్ల నెట్ కలెక్షన్లని, రెండో రోజు తొమ్మిది కోట్లు, మూడో రోజు రూ.9.10కోట్లు, నాల్గో రోజు రూ.7.50కోట్లు, ఐదో రోజు రూ.2.50కోట్లు, ఆరో రోజు రూ.1.75కోట్లు రాబట్టింది. ఇక బుధవారం ఏడో రోజు 1.14కోట్లని వసూలు చేసింది. గురువారం ఈ సినిమాకి వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. శుక్రవారం, శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వంద కోట్లకు చేరువ అవుతుందని టీమ్ భావిస్తుంది. మరి ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందా అనేది చూడాలి.
నెగటివ్ టాక్ ఉన్నా వసూళ్ల ప్రభంజనం!
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రూ.123కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ.250కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆ టార్గెట్ రీచ్ కావడం కష్టం. ఈ మూవీపై బయ్యర్లు దాదాపు 50-60కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ మూవీ విషయంలో నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు. థియేట్రికల్‌గా రూ.123కోట్లు, ఓటీటీ రూపంలో రూ.108కోట్లు వచ్చాయి. సినిమాకి రూ.150కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని సమాచారం. ఈ లెక్కన నిర్మాతలు లాభాల్లో ఉన్నారు. మరి బయ్యర్లని ఏ మేరకు ఆదుకుంటారో చూడాలి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్ల గురించి తెలుసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


