|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగే! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

Published: 13-03-2026, 11:35 AM
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగే! 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 18న విడుదల కానుంది, ప్రీ రిలీజ్ వేడుక మార్చి 15న.
  • సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.
  • తెలంగాణలో టికెట్ల ధరల పెంపుకు అనుమతి లేదు, గతంలోనే తెలంగాణ మంత్రి స్పష్టం చేశారు.
  • గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల & ప్రీ రిలీజ్ వేడుక

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 18వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ కూడా విడుదల చేశారు ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మార్చి 15వ తేదీ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.

ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి తెలుపుతూనే మరోవైపు పది రోజులపాటు టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.. మరి బెనిఫిట్ షో తో పాటు టికెట్ ధరలు ఎంత పెంచారు ఏంటి అనే విషయానికి వస్తే.. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో కి 500 రూపాయలు చొప్పున టికెట్ ధరలను నిర్ణయించింది. ఇక సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ తీయేటర్లలో 100 రూపాయలను పెంచగా, మల్టీప్లెక్స్ లలో రూ. 125 రూపాయలు ధరలు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది. పెరిగిన ధరలు పది రోజులపాటు అందుబాటులో ఉన్నాయి . 11వ రోజు నుంచి యధావిధిగా సాధారణ టికెట్ ధరలతో అందుబాటులో ఉండనుంది.

ఏపీలో టికెట్ల ధరల పెంపుకు అనుమతి

ఈ విధంగా ఏపీలో ఈ సినిమా టికెట్ల రేట్ల అనుమతి రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ మరికొందరు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నిత్యవసరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలపై సినిమా టికెట్ల భారం వేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచడానికి ఎలాంటి అనుమతి ఉండదనే చెప్పాలి .గతంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఇకపై టికెట్ల రేట్లు పెంచమని కోరుతూ తన వద్దకు రావద్దు అంటూ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తుంటే కేవలం ఏపీలో మాత్రమే పవన్ సినిమాకు టికెట్ ధరలు పెరిగాయి .

గబ్బర్ సింగ్ లాంటి హిట్ వచ్చేనా..

తెలంగాణలో టికెట్ల ధరలపై స్పష్టత

ఇక ఈ సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ జోడిగా శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడుగా పనిచేశారు.

ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలు పెంచడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఇది సామాన్యులపై భారం అని విమర్శిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎదురుచూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.