
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం!
- డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.80 కోట్ల భారీ ఆఫర్!
- గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
- మార్చి 26న విడుదల కానున్న ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
నెట్ ఫ్లిక్స్ చేతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ హక్కులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ లాక్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. తాజాగా ఈ సంస్థ ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 80 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా కనిపించనుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తమిళ మూవీ అయిన ‘తేరి’కి రీమేక్ అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఈ చిత్ర స్క్రీన్ ప్లే రైటర్లలో ఒకరైన దశరథ్ ఇది ఏ సినిమాకి రీమేక్ కాదని, దీనిని పూర్తిగా కొత్త కథతో రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా తేరి మూవీకి రీమేక్గా రూపొందుతుందా లేక కొత్త కథతో తెరకెక్కుతుందా అనేది తెలియాలంటే మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
రికార్డ్ స్థాయిలో డిజిటల్ రైట్స్ అమ్మకం
మార్చి 26న థియేటర్లలో విడుదల
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఓటీటీ హక్కుల గురించి తాజా సమాచారం ఇది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వేచి చూడండి!


