
📌 Key Points
- పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న గ్రాండ్ రిలీజ్!
- హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మాస్ అవతార్: శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్!
- OG బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా: భారీ అంచనాలు!
- పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్: రికార్డులు కొల్లగొట్టేందుకు ఉస్తాద్ రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుండటంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓజీ లాంటి భారీ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలోనే తాజాగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశారు. మార్చ్ 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్నట్టుగా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మాస్ ట్రీట్
శ్రీలీల, రాశి ఖన్నా గ్లామర్ డోస్
ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

