
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తులసి మొక్కను ఏ దిశలో ఉంచాలి, ఎలా సంరక్షించాలి అనే విషయాలను తెలుసుకుందాం.
Key Points
తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం.
దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు.
తులసి మొక్కను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
ముళ్ళ మొక్కలను తులసి మొక్క పక్కన ఉంచకూడదు.
తులసి మొక్కను ఉంచడానికి ఉత్తమ దిశలు
ప్రతి ఒక్కరూ కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. అడ్డంకులు, సమస్యలు ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తులసి మొక్కను నాటుతారు.
తులసి మొక్క ఎదుట రోజూ దీపారాధన చేసి నీటిని సమర్పిస్తారు. అయితే, పవిత్రమైన తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మేలు కలుగుతుందని అందరికీ తెలుసు. కానీ వాస్తు ప్రకారం అది ఏ దిశలో ఉండాలని విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు తులసి మొక్కకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను తెలుసుకుందాం.
హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పెడతారు. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ కటాక్షంతో సంతోషం ఉంటుంది. అయితే, తులసి మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు అది సరైన దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. తులసి మొక్క ఏ దిశలో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
తప్పించాల్సిన దిశలు మరియు కారణాలు
తులసి మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. డబ్బుకు కూడా లోటు ఉండదు. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు. ఇక తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలనే విషయానికి వస్తే ఇంటి ముంగిట లేదా మధ్యలో తులసి మొక్కను పెట్టొచ్చు. ఉత్తరం, ఈశాన్యం వైపు పెట్టి పూజిస్తే మంచిది. మీరు మీ ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో పెట్టాలనుకుంటే ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
ఈ దిశలో మాత్రం తులసి మొక్కను పెట్టకండి
వాస్తు ప్రకారం తులసి మొక్కను దక్షిణం వైపు పెట్టడం మంచిది కాదు. అలా చేయడం వలన పితృ దేవతలకు కోపం వచ్చి ఇబ్బందులు రావచ్చు. దక్షిణ దిశలో యమధర్మరాజు ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవికి కోపం వస్తుంది. డబ్బు కూడా నిలవదు. పేదరికంతో ఇబ్బంది పడాలి.
తులసి మొక్క సంరక్షణ మరియు శుభ్రత
తులసి మొక్క ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే దురదృష్టం కలిగే అవకాశం ఉంది. తులసి మొక్క ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెత్తాచెదారం కలిగి ఉండకూడదు. తులసి మొక్కను రోజూ శుభ్రం చేసి, తులసి మొక్క ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తులసి మొక్క పక్కన ఎలాంటి ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని తులసి మొక్కను ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి. డబ్బుకు లోటు ఉండదు. ఆనందంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తులసి మొక్కను సరైన దిశలో ఉంచి, శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. వాస్తు నియమాలను పాటించడం ద్వారా సుఖ సంతోషాలు పొందవచ్చు.


