|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! రాజకీయాల్లోకి వరలక్ష్మి శరత్ కుమార్.. పోటీ ఎక్కడ నుండి?

Published: 05-03-2026, 12:05 AM
సంచలనం! రాజకీయాల్లోకి వరలక్ష్మి శరత్ కుమార్.. పోటీ ఎక్కడ నుండి?
  • వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  • ఆమె తెలుగు లేదా తమిళనాడు రాష్ట్రాల నుండి పోటీ చేయవచ్చు.
  • ప్రస్తుతం ఆమె ‘సరస్వతి’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
  • వరలక్ష్మి తన టాలెంట్ ను తమిళ చిత్ర పరిశ్రమ సరిగ్గా వాడుకోలేదని అన్నారు.

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆమె తెలుగు లేదా తమిళనాడు రాష్ట్రాల నుండి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ‘సరస్వతి’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న విడుదల కానుంది.

రాజకీయాలపై వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తి

Varalakshmi Sarathkumar:ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ పెద్దగా కలిసి రాకపోవడంతో నటిగా తన రూట్ మార్చుకుంది. అలా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి విలన్ గా అడుగుపెట్టి.. తన సత్తా ఏంటో నిరూపించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో లేడీ విలన్ క్యారెక్టర్లు పోషించి మరో రమ్యకృష్ణ గా పేరు దక్కించుకుంది.

అలా నటిగా దూసుకుపోతున్న క్రమంలో తాజాగా ఈమె దర్శకురాలిగా , నిర్మాతగా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘సరస్వతి’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ అనేక విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగానే రాజకీయాల గురించి ప్రస్తావించి అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ ముద్దుగుమ్మ. రాజకీయ ఎంట్రీ పై వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..” ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. నాకంటూ పెద్దగా ప్రాపర్టీలు ఏం లేవు. నా సంపాదనతోనే ఒక కారు కొనుక్కున్నాను. అలాగే చిన్న ఇల్లు కూడా కొన్నాను. ఇక భారీగా ఆస్తులు ఉంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఉంటాను. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఇక భవిష్యత్తులో నేను కూడా తమిళనాడు లేదా తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది అని స్పష్టం చేసి అంచనాలు పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తన నటనతోనే అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఒకవేళ రాజకీయ ఎంట్రీ ఇస్తే మాత్రం అంతకుమించి సక్సెస్ అందుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు, తమిళనాడు రాష్ట్రాల నుండి పోటీ చేసే అవకాశం

ఇకపోతే సరస్వతీ సినిమా గురించి మాట్లాడుతూ..” ఈ సినిమా షూటింగ్ అయిపోయాక చిత్ర యూనిట్ అందరికీ కూడా ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. నన్ను తమిళ చిత్ర పరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా అక్కడ ఎవరూ కూడా నా టాలెంట్ ను పట్టించుకోలేదు “అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికైతే సరస్వతి చిత్రం తన జీవితంలో ఒక స్పెషల్ మూవీ అని దానికోసం చాలా జాగ్రత్తలు, కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది.

‘సరస్వతి’ సినిమాతో దర్శకురాలిగా మారిన వరలక్ష్మి

ఇకపోతే వరలక్ష్మీ శరత్ కుమార్ తన పెళ్లికి 800 కోట్లు ఖర్చు పెట్టింది అంటూ సోషల్ మీడియాలో ఒకరు వార్త రాశారు. అది చూసి నేను నవ్వుకున్నాను . ఒకవేళ నా దగ్గరే అంత డబ్బు ఉంటే నేనెందుకు ఇక్కడ ఉంటాను అంటూ వరలక్ష్మి నవ్వుకుంది. మొత్తానికి అయితే అన్ని విషయాలపై స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

వరలక్ష్మి శరత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే మరింత రాణిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ‘సరస్వతి’ చిత్రం మార్చి 6న విడుదల కానుంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఒక ప్రత్యేక చిత్రం అవుతుందని ఆమె అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.