
📌 Key Points
- నటుడు బ్రహ్మాజీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్’ సినిమాపై సంచలనాత్మకమైన రివ్యూ ఇచ్చారు.
- వర్మ తన రివ్యూలో సౌత్ యాక్షన్ డైరెక్టర్లకు తనదైన శైలిలో చురకలు అంటించారు.
- వర్మ రివ్యూకు ఆస్కార్ ఇవ్వాలని బ్రహ్మాజీ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్.
నటుడు బ్రహ్మాజీ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్’ సినిమాపై ఇచ్చిన రివ్యూకు ఆస్కార్ ఇవ్వాలని బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్’ రివ్యూలో ఏముంది?
Actor Brahmaji: నటుడు బ్రహ్మాజీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమాలలో కమెడియన్ గా, విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తనదైన మాట తీరుతో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా బ్రహ్మాజీ అధికారిక ఎక్స్ వేదికగా ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆర్జీవీ తాజాగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా నటించిన “ధురంధర్ ” (Dhurandhar)సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వర్మ ఈ సినిమాలోని నటీనటుల నటనపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలోనే సౌత్ ఇండియా డైరెక్టర్లకు తనదైన శైలిలోనే చురకలంటించారు. ఈ సినిమాలో హింసను కేవలం చప్పట్లు కొట్టించే అంశంగా మాత్రమే కాకుండా, మానసికంగా అఘాతంలో చూపించారు. యాక్షన్ డైరెక్టర్ పని తీరు అద్భుతంగా ఉందని, ఇప్పటివరకు నేను చూసినా భారతీయ సినిమాలలో ది బెస్ట్ యాక్షన్ సినిమా అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమా చూసి మన సౌత్ యాక్షన్ డైరెక్టర్లు చాలా నేర్చుకోవాలని హితవు పలికారు. ధురంధర్ కేవలం బ్లాక్ బస్టర్ సినిమా కాదు, ఫిలిం ఇండస్ట్రీకి ఇది ఒక హెచ్చరిక అంటూ ఈయన తెలియజేశారు
ఈ విధంగా వర్మ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ తరుణంలోనే వర్మ చేసిన ఈ పోస్టుపై బ్రహ్మాజీ(Bramhaji) స్పందిస్తూ .. ఒకవేళ సినిమా రివ్యూలకు కూడా అవార్డులు ఇస్తే.. ధురంధర్ సినిమాకు రివ్యూ చెప్పిన రాంగోపాల్ వర్మ గారికి ఆస్కార్ అవార్డు(Oscar Award) ఇవ్వాలి అంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో బ్రహ్మాజీ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ పట్ల నెటిజన్లు స్పందిస్తూ అది వర్మ రివ్యూ కాదని చాట్ జీపీటీ రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక వర్మ ఏ విషయాన్ని అయిన నిర్మొహమాటంగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధురంధర్ సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
బ్రహ్మాజీ సంచలన స్పందన: ఆస్కార్ ఎందుకు?
If reviews ever got awards, RGV sir would deserve an Oscar for this one.💥.. @RGVzoomin 🙏🏼 https://t.co/pr4soW0x91
— Brahmaji (@actorbrahmaji) December 19, 2025
సోషల్ మీడియాలో నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఈ విధంగా వర్మ పోస్టు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ పట్ల బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక బ్రహ్మాజీ కెరియర్ విషయానికి వస్తే ఎన్నో సినిమాలలో ఈయన పాజిటివ్ పాత్రలతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సినిమాలలో బ్రహ్మాజీ నటించి సందడి చేసిన సంగతి తెలిసిందే.
బ్రహ్మాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా రివ్యూలపై కొత్త చర్చను రేకెత్తించాయి. వర్మ రివ్యూ, బ్రహ్మాజీ స్పందన రెండూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, వారిద్దరి ప్రభావానికి నిదర్శనంగా నిలిచాయి.

