
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవల తల్లిదండ్రులయ్యారు. తమ ముద్దుల కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్ఫూర్తిగా తీసుకుని ‘వాయువ్ తేజ్’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ వార్త మెగా అభిమానుల్లో ఆనందం నింపింది.
Key Points
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు గత నెల 10న మగ పిల్లాడు పుట్టాడు.
కుమారుడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.
వరుణ్-లావణ్య దంపతులు కొడుకు పరిచయం చేస్తూ రెండు ఫొటోలు విడుదల చేశారు.
బారసాల వేడుకను మెగా ఫ్యామిలీ గోప్యంగా ఉంచి, ప్రస్తుతం పేరు ప్రకటించారు.
వరుణ్-లావణ్య దంపతులకు మగబిడ్డ
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. రెండేళ్ల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. గత నెల 10న వీళ్లకు మగ పిల్లాడు పుట్టాడు. రీసెంట్‌గానే మూడు నాలుగు రోజుల క్రితం బారశాల వేడుక జరిగింది. దీనికి మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. కాకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల బయటకు రాకుండా చాలా గోప్యంగా ఉంచారు.
హనుమంతుడి పేరుతో ‘వాయువ్ తేజ్’గా నామకరణం
ఇప్పుడు స్వయంగా వరుణ్-లావణ్య దంపతులు తమ కొడుకు పరిచయం చేస్తూ పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని ‘వాయువ్ తేజ్’ అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు రెండు ఫొటోల్ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ లైకులు కొట్టేస్తున్నారు.
నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అయిపోయారు.
కొడుకును పరిచయం చేసిన వరుణ్ తేజ్
మొత్తంగా, వరుణ్ తేజ్-లావణ్య దంపతుల కొడుకు పేరు ప్రకటన మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ‘వాయువ్ తేజ్’ అనే పేరుతో ఈ కొత్త తరానికి స్వాగతం పలికిన మెగా ఫ్యామిలీకి మరియు వరుణ్-లావణ్య దంపతులకు శుభాకాంక్షలు.


