|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vankatesh-Rana: హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!

Published: 16-10-2025, 8:52 AM
Vankatesh-Rana: హోటల్ లీజు వివాదం.. వెంకటేశ్, రానాకు కోర్టు షాక్!

ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో నటులు వెంకటేశ్, రానా, నిర్మాత సురేశ్ బాబుకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. నవంబర్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లీజు వివాదం, కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.

Key Points

1

వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబు కోర్టుకు హాజరుకావాలని ఆదేశం.

2

నవంబర్ 14న వ్యక్తిగత బాండ్ సమర్పించేందుకు కోర్టుకు రావాలి.

4

హోటల్ యజమానికి రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు.

కోర్టు ఆదేశాలు ఏమిటి?

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు  వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేశ్‌ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని  ఆదేశించింది. కాగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్‌ హోటల్‌ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేశ్‌పై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.

అసలు వివాదం ఏంటి?

అసలు ఈ కేసు వివాదం ఏంటి..?

దగ్గుబాటి కుటుంబంపై కేసు ఎందుకు?

డెక్కన్‌ కిచెన్‌ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్‌, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్‌ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్‌ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్‌ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ ఏడాది జనవరిలో గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

దక్కన్ కిచెన్ హోటల్ లీజు వివాదం, కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరుకావాల్సి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 14న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.