
📌 Key Points
- వెంకటేష్ దృశ్యం 3 నుంచి తప్పుకోవడానికి రెమ్యూనరేషన్ కారణమని సమాచారం.
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నారు.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి సినిమా చేయనున్నారు.
- ‘ఆదర్శ కుటుంబం’ సినిమా దసరా పండుగకు విడుదల కానుంది.
వెంకటేష్ దృశ్యం 3 సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రెమ్యూనరేషన్ పెరగడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారు.
దృశ్యం 3 నుండి తప్పుకున్న వెంకటేష్?
Actor Venkatesh: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయింది అంటే ఆ సినిమా ఫ్రాంచైజీలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాలు ఇప్పటికే ఫ్రాంచైజీల రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి వాటిలో దృశ్యం ఫ్రాంచైజీ కూడా ఒకటి. దృశ్యం సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక మూడో భాగం తెలుగులో షూటింగ్ ప్రారంభించకపోయిన తమిళం హిందీ భాషలలో మాత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే దృశ్యం3 (Drishyam 3)తెలుగులో ఉంటుందా? లేదా? అనే సందిగ్ధం అందరిలోనూ ఉంది.
దృశ్యం 3 సినిమా తెలుగులో ఉండకపోవచ్చు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ నిర్మాత సురేష్ బాబు మాత్రం ఒకానొక సందర్భంలో దృశ్యం 3 సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా సమాచారం మేరకు దృశ్యం 3 సినిమా ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ నుంచి వెంకటేష్ తప్పుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వెంకటేష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం వెంకటేష్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్న నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశారు.
రెమ్యూనరేషన్ పెరగడమే కారణమా?
ఇలా వెంకటేష్ రెమ్యూనరేషన్ పెరగటం వల్ల దృశ్యం 3 సినిమా వెంకటేష్ తో చేయడం అధిక భారం అవుతున్న నేపథ్యంలోనే వెంకటేష్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా(AK 47 film) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
దసరా బరిలో ఆదర్శ కుటుంబం..
వెంకటేష్ తదుపరి సినిమాలు
ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా విడుదల చేయటానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను శర వేగంగా కొనసాగిస్తున్నారు. ఇక వెంకటేష్ సైతం ఈ సినిమాతో పాటు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే వెంకటేష్ కూడా దృశ్యం 3 నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో వెంకటేష్ ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా అధికమినరేషన్ తీసుకోవడం వల్ల దృశ్యం 3 సినిమాలో మరో హీరో భాగం కాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.
మొత్తానికి వెంకటేష్ దృశ్యం 3 నుండి తప్పుకోవడం వెనుక రెమ్యూనరేషన్ కారణమని వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


