|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Venkatesh: వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన ముద్దుగుమ్మ!

Published: 21-10-2025, 12:19 PM
Venkatesh: వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన ముద్దుగుమ్మ!

విక్టరీ వెంకటేశ్‌-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి ఎంపికైంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వెంకటేశ్‌కు ఇది 77వ సినిమా.

Key Points

1

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా ఖరారు.

2

ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీనిధిశెట్టిని ఎంపిక చేశారు.

4

ఇది విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో 77వ సినిమా.

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్‌ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్‌ సరసన కనిపించనున్న హీరోయిన్‌ పేరును రివీల్‌ చేశారు మేకర్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ హీరోయిన్ పేరును వెల్లడించింది. కేజీఎఫ్‌తో స్టార్‌డమ్‌ దక్కించుకున్న శ్రీనిధిశెట్టి ఈ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.

ఇవాళ ఆమె బర్త్‌ డే కావడంతో మేకర్స్‌ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పోస్టర్‌ను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్‌ తర్వాత టాలీవుడ్‌లో నాని హిట్‌- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది. కాగా..ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.

శ్రీనిధిశెట్టికి హీరోయిన్‌గా ఛాన్స్

వెంకీ 77వ సినిమా విశేషాలు

వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబో, శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా ఎంపికతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.