|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వెన్నుపోటు ఆయుధమవుతుంది నాయుడు..ఇద్దరు సీఎంలు.. క్రేజీ వెబ్ సిరీస్ ‘మయసభ’ ఓటీటీలోకి ఎప్పుడంటే? సీబీఎన్, వైఎస్సార్ కథతోనేనా?

Published: 12-07-2025, 9:24 PM
వెన్నుపోటు ఆయుధమవుతుంది నాయుడు..ఇద్దరు సీఎంలు.. క్రేజీ వెబ్ సిరీస్ ‘మయసభ’ ఓటీటీలోకి ఎప్పుడంటే? సీబీఎన్, వైఎస్సార్ కథతోనేనా?

తెలుగు రాష్ట్రాల రాజకీయ నేపథ్యంలో రూపొందిన ‘మయసభ’ అనే క్రేజీ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. వైఎస్సార్, చంద్రబాబు నాయుడుల కథలను ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ నిర్మించబడింది.

Key Points

1

వైఎస్సార్, చంద్రబాబు నాయుడుల జీవితాల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ‘మయసభ’

2

ఆగస్టు 7 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్

4

తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో విడుదల

‘మయసభ’ వెబ్ సిరీస్ విడుదల తేదీ

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ను మరింత పెంచే.. ఇద్దరు అగ్ర రాజకీయ నాయకుల కథతో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథను రిఫరెన్స్ గా తీసుకుని ఈ సీరిస్ ను రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ఈ రోజు (జూలై 12) రిలీజ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్.. సిరీస్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది.

వైఎస్సార్, సీబీఎన్ కథతో తెరకెక్కుతున్న మూవీకి ‘ మయసభ ’ అనే టైటిల్ ఖరారు చేశారు. సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. సోనీ లివ్ ఓరిజినల్ సిరీస్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా శనివారం అనౌన్స్ చేశారు. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ ఓటీటీ లో ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ పొలిటీషియన్స్ కథతో రాబోతోంది ఈ సిరీస్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

నటీనటులు మరియు కథాంశం

‘‘పొలిటికల్ ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు గొప్ప స్నేహితుల కథ. స్టోరీ ఆఫ్ ది స్టేట్ గా మారిన కథ’’ అని సోనీ లివ్ పేర్కొంది.

దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు, వైశ్రాయ్ హోటల్ సీన్లను గుర్తు చేస్తూ మయసభ టీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఇద్దరు మెయిన్ లీడర్లు ఫోన్లో మాట్లాడుకుంటారు. ‘ఏం జరుగుతుంది నాయుడు’ అని అడిగితే ‘కురుక్షేత్రం’ అని సమాధానం వస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినవ్, ఫ్రెండ్ గానా? ప్రత్యర్థి గానా’ అని అడుగుతాడు. అర్థం కావడం లేదు రెడ్డి అంటాడు. ఈ రోజు నువ్వు గెలిస్తే వెన్నుపోటు అనేది నా చేతిలో ఆయుధంగా మారుతుంది అని రెడ్డి అంటాడు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్ మరియు భాషలు

చివరకు పిల్లనిచ్చి మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నా అని నాయుడు అంటే.. యుద్ధం నీ ధర్మం అని రెడ్డి అంటాడు. ఇక రెడ్డి, నాయుడు కాలేజీ రోజులు, గొడవలు, గ్రూప్ తగాదాలతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

దేవా కట్టా, కిరణ్ జై కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మయసభ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నటిస్తారనే వార్తలొచ్చాయి. కానీ అతను ఈ సిరీస్ లో లేడు. ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ ప్లే చేశారు. వైఎస్సార్ గా ఆది పినిశెట్టి, సీబీఎన్ గా చైతన్య రావు యాక్ట్ చేశారు. ఈ సిరీస్ లో సాయి కుమార్, దివ్య దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు.

చివరగా, వైఎస్సార్, చంద్రబాబు నాయుడుల జీవితాల ఆధారంగా రూపొందిన ‘మయసభ’ వెబ్ సిరీస్ అభిమానులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. ఆగస్టు 7న సోనీ లివ్ లో చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.