
📌 Key Points
- రాజమౌళి జాతకంలో బుధుడు ఉండటం వల్లే అపజయం లేదన్న వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.
- దర్శకుడు శ్రీను వైట్ల గారిని ఆదర్శంగా తీసుకోవాలని రాజమౌళికి వేణు స్వామి హెచ్చరిక!
- వారణాసి గ్లింప్స్ రిలీజ్ రోజు టెక్నికల్ సమస్యలు రావడానికి కారణం చిన్నమస్తా దేవి అని వేణు స్వామి వెల్లడి.
- మహేష్ బాబుతో రాజమౌళి సినిమా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం.
టాలీవుడ్ సెన్సేషన్! రాజమౌళి గురించి జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు వెల్లడించారు. రాజమౌళికి ఎప్పుడు ఫ్లాప్ వస్తుంది? ఆయన జాతకం ఎలా ఉంది? వారణాసి సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళికి ఫ్లాప్ ఎప్పుడు? వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!
దర్శక ధీరుడు రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో హాలీవుడ్ వాళ్ళు సైతం రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 1300 కోట్ల బడ్జెట్ లో వారణాసి అనే చిత్రాన్ని రూపొందింస్తున్నారు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి చిత్రం సూపర్ హిట్.
అయితే రాజమౌళి కి అసలు ఫ్లాప్ అనేది ఉండదా అనే చర్చ టాలీవుడ్ లో ఎప్పటి నుంచో జరుగుతోంది. తన సినిమా హిట్ కావడం కోసం రాజమౌళి పక్కా ప్రణాళిక తో ముందుకు వెళతారు. కుటుంబం మొత్తం ఒక టీమ్ లాగా పనిచేస్తుంది. అసలు రాజమోళి జాతకం ఎలా ఉంది ? ఆయనకి ఫ్లాప్ ఉండదా అనే ప్రశ్నపై వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.
శ్రీను వైట్లనే గుర్తు చేసుకోండి: రాజమౌళికి వేణు స్వామి వార్నింగ్!
రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. అలాంటప్పుడు 10 పైసలుతో సినిమా చేస్తే ఒక రూపాయి బిజినెస్ జరుగుతుంది. రాజమౌళి గురించి ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జాతకం అలా ఉన్నంత వరకు పరాజయం ఉండదు. అందరు డైరెక్టర్లు తీసే కాన్సెప్ట్స్ తోనే రాజమౌళి కూడా సినిమాలు చేస్తారు. కానీ ఆయన జాతకం వల్ల ఆ సినిమాలు పెద్దవిగా కనిపిస్తాయి అని వేణు స్వామి అన్నారు.
టాలీవుడ్ లో ఎక్కువ హిట్లు ఉన్న దర్శకులు కొరటాల, అనిల్ రావిపూడి లాంటివాళ్లు ఉన్నారు. కానీ ఇక్కడ రాజమౌళి అయినా, కొరటాల అయినా శ్రీను వైట్ల గారిని మైండ్ లో పెట్టుకోవాలి. ఒకప్పుడు శ్రీనువైట్ల ఎలాంటి అద్భుతమైన సినిమాలు చేశారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి ? కాబట్టి ఎంత పెద్ద డైరెక్టర్ అయినా శ్రీను వైట్ల గారిని గుర్తు చేసుకోవాలి అని వేణు స్వామి వార్నింగ్ ఇచ్చారు. రాజమౌళి కి కూడా ఫ్లాప్ పడొచ్చు అని పరోక్షంగా పేర్కొన్నారు.
వారణాసి మూవీ గ్లింప్స్ లో టెక్నికల్ ఇష్యూస్ వెనుక అసలు కారణం ఇదేనా?
వారణాసి మూవీ గురించి కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారణాసి గ్లింప్స్ లో చిన్నమస్తా దేవిని చూపించారు. అలాంటి ఉగ్ర దేవతలని చూపించేటప్పుడు ఆ ప్రకంపనలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తి రాజమౌళి కి ఉండాలి. దాని ఫలితంగానే గ్లింప్స్ రిలీజ్ రోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆంజనేయస్వామి గురించి రాజమౌళి నోరు జారారు అని వేణు స్వామి తెలిపారు.
వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాజమౌళి భవిష్యత్తు గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఆయన తదుపరి చిత్రం ‘వారణాసి’ పై మరింత సమాచారం కోసం వేచి ఉండండి.


