
📌 Key Points
- జబర్దస్త్ నుండి వేణు ఎల్దండి దర్శకుడిగా ఎదిగారు.
- బలగం సినిమాతో వేణు తెలంగాణ సంస్కృతిని చాటారు.
- దిల్ రాజు బ్యానర్ లో ‘ఎల్లమ్మ’ సినిమాకు వేణు దర్శకత్వం వహిస్తున్నారు.
- దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ‘ఎల్లమ్మ’ సినిమాతో పరిచయం కానున్నారు.
జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వేణు ఎల్దండి ‘బలగం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ‘ఎల్లమ్మ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్నారు.
జబర్దస్త్ నుండి దర్శకుడిగా వేణు
Venu Yeldandi జబర్దస్త్ షో ద్వారా కమెడియన్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారిలో వేణు ఎల్దండి (Venu Yeldandi)ఒకరు. వేణు డైరెక్షన్ పై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బలగం సినిమా(Balagam) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమాకు వచ్చిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, అనుబంధాల నేపథ్యంలో తెరకక్కిన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా చూసి విడిపోయిన తోబుట్టువులు కూడా కలిశారంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో స్పష్టమవుతుంది.
బలగం లాంటి ఒక సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ వేణుకి దిల్ రాజు తన బ్యానర్ లోనే తదుపరి రెండో సినిమా అవకాశం కూడా ఇచ్చారు. ఈయన ఎల్లమ్మ(Yellamma) అనే టైటిల్ తో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు కానీ ఈ సినిమా పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించడం కోసం హీరోలు దొరకని నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇలా ఎంతోమంది హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో చివరికి సంగీతం దర్శకుడు దేవిశ్రీపసాద్(Devi sri prasad) ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని నేపథ్యంలో అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ ఎల్లమ్మ సినిమా గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు. వేణుకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీ సాయంత్రం 4:05 నిమిషాలకు వీడియో విడుదల కానుందని తెలియజేశారు.
తెలంగాణ సంస్కృతిని చాటిన ‘బలగం’
#Balagam wasn’t just a film it was an emotion that showed us who we are and where we come from ❤️
Now @VenuYeldandi9 returns to unfold another journey we have been eagerly waiting for 🫶🏻
▶️ https://t.co/t5i0Wd85Qu #SVC61 Glimpse on Jan 15th @ 4:05 PM ✨ #DilRaju #Sirish … pic.twitter.com/BsmouRiN4y
‘ఎల్లమ్మ’తో దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం
— Sri Venkateswara Creations (@SVC_official) January 13, 2026
ఈ వీడియోలో భాగంగా వేణు మాట్లాడుతూ తన మొదటి సినిమా బలగం సినిమాకు మీ నుంచి ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక రెండో సినిమాకి కూడా అదే ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ తన సినిమా అప్డేట్ తెలియచేశారు. ఇలా ఈ సినిమా నుంచి అప్డేట్ రావడంతో అభిమానులు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్ నటిస్తుండగా హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలు నిజం కాదని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు. మరి ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతున్న నటి ఎవరు? ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది.
వేణు ఎల్దండి దర్శకత్వంలో వస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎలా నటిస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


