|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీఎంగా విజయ్.. త్రిష భవిష్యత్తుపై ఉత్కంఠ! రాజకీయమా? పెళ్లా?

Published: 10-05-2026, 6:30 AM
సీఎంగా విజయ్.. త్రిష భవిష్యత్తుపై ఉత్కంఠ! రాజకీయమా? పెళ్లా?
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం, తొమ్మిది మంది మంత్రులతో కేబినెట్ కొలువుదీరింది.
  • విజయ్ ప్రమాణస్వీకారానికి త్రిష హాజరు, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
  • త్రిష రాజకీయ ప్రవేశం, విజయ్ తో సంబంధం, పెళ్లిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
  • విజయ్ త్రిషను రాజకీయాలకు దూరం చేస్తాడా లేక ఎంజేఆర్-జయలలిత మాదిరిగా ఉంటారా అనేది ఉత్కంఠ.

తమిళనాడులో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన ప్రమాణస్వీకారానికి త్రిష హాజరు కావడంతో, ఆమె రాజకీయ భవిష్యత్తు, విజయ్ తో ఆమె సంబంధంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. త్రిష రాజకీయాల్లోకి వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం

అనేక నాటకీయ పరిణామాల తరవాత తమిళనాడులో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిదిమంది మంత్రులతో కలిసి విజయ్ కేబినెట్ కొలువుదీరింది. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతడి తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా హాజరయ్యారు. త్రిష ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే తమిళనాడులో ఎన్నికలు జరగముందు నుండే విజయ్ పార్టీలోకి త్రిష కూడా వెళతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని త్రిష కచ్చితంగా విజయ్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు.

త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

ఎన్నికల తరవాత విజయ్ పార్టీకి మెజార్టీ స్థానాలు రావడంతో పాటు విజయ్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. దీంతో ఒక సీటుకు విజయ్ రాజీనామా చేసి త్రిషను బరిలోకి దింపుతాడనే ప్రచారం మొదలైంది. కానీ ఇప్పుడు ఆ టికెట్ పొత్తులో భాగమైన ఓ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ సీఎం అయ్యాడు త్రిష పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. విజయ్ త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రపంచం కోడై కూస్తోంది.

విజయ్-త్రిష సంబంధంపై చర్చ

ఆ ప్రచారానికి తగినట్టే త్రిష గెలిచిన వెంటనే విజయ్ ఇంటికి వెళ్లడం, తరవాత ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవ్వడం జరిగింది. దీంతో విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయ్ త్రిషను రాజకీయాల్లోకి రానివ్వడని పెళ్లి చేసుకుంటాడని కానీ రాజకీయాలకు దూరంగా ఉంచుతాడనే ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. మరోవైపు వీరిద్దరు పెళ్లి చేసుకోరు కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంజేఆర్, జయలలిత మాదిరిగా ఉంటారనే టాక్ ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.

విజయ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. త్రిష రాజకీయ ప్రవేశం, వారిద్దరి బంధంపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో త్రిష పాత్ర ఎలా ఉండబోతోంది, వారిద్దరి సంబంధం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.