
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ వైరల్!
- కొడవ సాంప్రదాయంలో అంగరంగ వైభవంగా రష్మిక, విజయ్ రిసెప్షన్ వేడుక!
- స్కూల్ రోజుల్లోనే కూర్గ్ ట్రిప్స్ అంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
- కూర్గ్ అమ్మాయిల గురించి విజయ్ దేవరకొండ చేసిన హాట్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రష్మిక స్వస్థలంలో జరిగిన రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కూర్గ్‌లో గ్రాండ్ గా విజయ్, రష్మిక రిసెప్షన్
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించిన ఈ ఇద్దరు స్టార్స్ పెళ్లి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పెళ్లి తరువాత కూడా ఏదో ఒక రకంగా హాట్ టాపిక్ అవుతుంది ఈ జంట. విజయ్ రష్మిక పెళ్లి జరిగి దాదాపు నెలన్నరకు పైనే అవుతుంది. ఆతరువాత కూడా ఏదో ఒక ఈవెంట్ తో వార్తల్లో నిలిచిన ఈ జంట.. తాజాగా మరోసారి మరో ఈవెంట్ లో మెరిశారు.
తాజాగా మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ జిల్లా, విరాజ్ పేట్ లో లో రష్మిక సొంతూరులో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు. కొడవ సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రిసెప్షన్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ వేడుకకు రష్మిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరి పెళ్లికి హాజరు కాని రష్మిక బంధువులు, ఊరివారి కోసం ఈ వేడుకను నిర్వహించారు.
స్కూల్ డేస్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న విజయ్
ఈ రిసెష్పన్ లో రష్మిక కొడవ సంప్రదాయ గెటప్ లో కనిపించింది. ఇక ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “కూర్గ్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని నేను రష్మికను కలిసే ముందే నమ్మేవాడిని. ఆ అందమైన అమ్మాయిల్లో ఒకరిని నేను పెళ్లి చేసుకున్నాను” అని అన్నారు
కూర్గ్ అమ్మాయిలపై విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్
అలాగే కూర్గ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “నేను స్కూల్ చదివే రోజుల్లోనే మొదటిసారి హాలిడే వెకేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంతో నాకు ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తర్వాత మరోసారి వచ్చినప్పుడు నా స్నేహితుడి ఇంట్లో ఉన్నాను. అయితే ఆ స్నేహితుడు ఈ రోజు రిసెప్షన్‌కు రాలేదు… మరొకసారి మళ్లీ ఇక్కడికి వచ్చి రష్మిక చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను” అని విజయ్ దేవరకొండ అన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ వేడుక అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి.


