|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణబాలి వీడియో లీక్: రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ విధ్వంసం! ఈసారి బ్లాక్ బస్టరే!!

Published: 01-04-2026, 1:35 PM
రణబాలి వీడియో లీక్: రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ విధ్వంసం! ఈసారి బ్లాక్ బస్టరే!!
  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ‘రణబాలి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • అనంతపురం జిల్లాలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది.
  • గుర్రంపై కత్తితో విజయ్ చెప్పే రాయలసీమ డైలాగులు వీడియోలో హైలైట్ గా నిలిచాయి.
  • సెప్టెంబర్ 11, 2026న సినిమా విడుదల కానుంది, కర్నూలులో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అయితే, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. రాయలసీమ యాసలో విజయ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

రణబాలి షూటింగ్ అప్డేట్స్

Ranabaali: విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రణబాలి(Ranabaali) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రష్మిక (Rashmika)విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంటగా ఈ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి కోసం సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. తాజాగా విజయ్ రష్మిక ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ అనంతపురం జిల్లాలో పూర్తీ అయింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో కొన్ని యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.

గత రెండు రోజులుగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన విజయ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో భాగంగా విజయ్ దేవరకొండ గుర్రంపై ఒక ఇంటిలోకి వెళ్తూ రౌడీలను చంపేస్తున్నారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి.

వైరల్ అవుతున్న యాక్షన్ వీడియో

ఈ వీడియోలో భాగంగా విజయ్ దేవరకొండ గుర్రంపై కత్తి పట్టుకుని వస్తూ ముండమోపి నా కొడకా.. యాడుండావురా ,నీ ఇళ్లల్లోకి వచ్చినా.. రాప్పా సంపుదువు గాని అంటూ విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి. ఇలా ఈ యాక్షన్ ఎపిసోడ్ లో డైలాగులు చూస్తుంటే ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం కర్నూల్ లో జరగబోయే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కీలక డైలాగ్స్ కూడా బయటకు రావడంతో చిత్ర బృందం పూర్తిగా అప్రమత్తమవుతున్నారు.

సెప్టెంబర్ 11, 2026న రణబాలి విడుదల..

సెప్టెంబర్ 11న విడుదల

కర్నూలులో జరగబోయే షూట్ కి సంబంధించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇందులో భాగంగానే షూటింగ్ లొకేషన్లోకి వెళ్లే వారికి ఫోన్లు అనుమతి లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. రష్మిక ముచ్చటగా మూడోసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ 11 న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. ఇక ఈ సినిమా 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో, బ్రిటిష్ పాలనలోని అన్యాయాలకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ఒక వీరుడి కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శర వేగంగా నిర్వహిస్తున్నారు.

మొత్తానికి ‘రణబాలి’ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లీక్ అయిన వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. చిత్రం విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.