|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జంట సందడి! రిసెప్షన్ డేట్ ఫిక్స్!

Published: 27-02-2026, 7:35 AM
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో జంట సందడి! రిసెప్షన్ డేట్ ఫిక్స్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు.
  • ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఈ జంట సందడి చేసింది, ఫోటోలు వైరల్ అయ్యాయి.
  • మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరగనుంది.
  • రణబాలి సినిమాలో విజయ్, రష్మిక మరోసారి కలిసి నటించనున్నారు.

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగింది. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మార్చి 4న రిసెప్షన్ జరగనుంది.

విజయ్ రష్మికల వివాహం

Vijay Devarakonda Rashmika: సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna)తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం అనంతరం పలువురు రాజకీయ నాయకులను కలిసి వీరి వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం అనంతరం ఈ జంట తిరిగి హైదరాబాద్ పయనం అయ్యారు.

ఈ క్రమంలోనే రష్మిక విజయ్ దేవరకొండ ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో జంటగా కనిపించి సందడి చేశారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా కలిసి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు చుడీదార్ లో రష్మిక బ్రైడల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక ఈ జంట ఉదయ్ పూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలుస్తోంది. మార్చి 4వ తేదీ వీరి వివాహ రిసెప్షన్ జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో సందడి

ఇలా ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ వివాహ రిసెప్షన్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం అలాగే విజయ్ అభిమానులకు కూడా ఆహ్వానం అందిందని తెలుస్తుంది. ఇలా పెద్ద ఎత్తున విజయ్ రష్మిక వివాహ రిసెప్షన్ వేడుకను జరుపుకోబోతున్నారు. హైదరాబాదులో తాజ్ కృష్ణ హోటల్ లో ఈ వేడుక జరగనున్న సంగతి తెలిసిందే.

మరోసారి వెండితెరపై జంటగా విజయ్ రష్మిక..

రిసెప్షన్ వేడుక వివరాలు

ఇలా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక రష్మిక విజయ్ కెరియర్ విషయానికి వస్తే వీరిద్దరూ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి వేడుకలలో భాగంగా షూటింగ్ పనులకు చిన్నవిరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ రష్మిక జంటగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాల తర్వాత ఈ జంట మరోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రణబాలి(Ranabaali) అనే సినిమాలో వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇక పెళ్లి తర్వాత రష్మిక విజయ్ దేవరకొండ వెండి తెరపై జంటగా కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వీరిద్దరికీ ఎంతో స్పెషల్ గా ఉండబోతుందని చెప్పాలి. త్వరలోనే వీరిద్దరూ తిరిగి ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వేడుకలు మరియు రిసెప్షన్ కార్యక్రమం సినీ అభిమానులకు కనువిందు చేయనుంది. వీరిద్దరూ కలిసి రణబాలి సినిమాలో ఎలా నటిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.