|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్! టాలీవుడ్ రికార్డ్ బ్రేక్!

Published: 04-03-2026, 10:35 AM
షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్! టాలీవుడ్ రికార్డ్ బ్రేక్!
  • విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది
  • ఈ జంట పెళ్లి కోసం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేశారని సమాచారం
  • రష్మిక 2 కేజీలు, విజయ్ 1 కేజీ బంగారం ధరించారని టాక్, ఇది టాలీవుడ్ లోనే రికార్డు
  • నాగచైతన్య, సమంత పెళ్లి ఖర్చును కూడా ఈ జంట అధిగమించిందని సమాచారం

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్! వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. అసలు ఈ పెళ్లికి ఎంత ఖర్చు అయిందో తెలుసా?

విజయ్, రష్మిక పెళ్లి: ఎక్కడ జరిగింది, ఎంతమంది వచ్చారు?

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. రాజులను తలపించేలా వీరి పెళ్లి జరగడం విశేషం. అతికొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అంతా వీరి మ్యారేజ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. మ్యారేజ్‌ చేసుకున్న తీరు, ఆ కల్చర్‌, ధరించిన నగలు గురించిన చర్చ జరిగింది. దీంతోపాటు తన సొంతూరు వ్రతం చేయడం, ఆ తర్వాత సంగీత్‌ కార్యక్రమం నిర్వహించడం ఇలా అంతా ఒక సెలబ్రేషన్‌లా సాగింది.

దాదాపు వారం రోజులుగా వీరి మ్యారేజ్‌ కి సంబంధించిన హడావుడినే జరుగుతుంది. మిగిలిన అన్నీ పక్కకు వెళ్లాయని చెప్పొచ్చు. అంతగా చర్చనీయాంశంగా మారిన విజయ్‌ దేవరకొండ, రష్మిక (విరోష్‌) వెడ్డింగ్‌ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. దీనికి ఎంత ఖర్చు అయ్యిందనేది ఆసక్తికరంగా మారింది. ఇంత గ్రాండ్‌గా చేసుకున్నారు కదా, ఎంత ఖర్చు చేశారని అంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో తమ పెళ్లికోసం విరోష్‌ జంట ఎంత ఖర్చు చేశారనేది చూస్తే.

పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారు? షాకింగ్ విషయాలు!

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా తమ పెళ్లి కోసం ఏకంగా రూ.20కోట్లు ఖర్చు చేశారట. పెళ్లి షాపింగ్‌ నుంచి, ఉదయ్‌ పూర్‌లో మ్యారేజ్‌, సొంతూరులో వ్రతం, ఊరి జనాలకు విందు భోజనం, ఆ తర్వాత సంగీత్‌ పార్టీ, అనంతరం అభిమానుల మీట్‌,  ఫైనల్‌గా ఇప్పుడు జరుగుతున్న రిసెప్షన్‌ ఇలా అన్ని కలుపుకొని దాదాపు ఇరవై కోట్ల వరకు ఖర్చు అయ్యిందని తెలుస్తోంది. షాపింగ్‌, గోల్డ్ కాస్ట్ ఇలా అన్నీ ఇంత ఖర్చు వచ్చిందని టాక్‌. తమ పెళ్లికి విజయ్‌, రష్మిక ఏకంగా మూడు కేజీల బంగారం ధరించారట. రష్మిక రెండు కేజీలు, విజయ్‌ కేజీ వరకు బంగారు అభరణాలు చేయించుకున్నట్టు టాక్‌.

అయితే ఈ పెళ్లి విషయంలో రష్మిక మందన్నా, అటు విజయ్‌ దేవరకొండ ఇద్దరూ ఈ ఖర్చుని షేర్‌ చేసుకున్నారట. తమ మ్యారేజ్‌ నిర్వాహణకు సంబంధించిన ఒక ఈవెంట్‌ కంపెనీ అన్నీ చూసుకుందని సమాచారం. ఇప్పుడు విజయ్‌, రష్మిక పెళ్లి టాలీవుడ్‌లోనే అత్యంత ఖరీదైన మ్యారేజ్‌గా నిలిచింది. ఎందుకంటే ఈ స్థాయిలో మరే హీరో ఖర్చు చేయలేదు. ఆ మధ్య నాగచైతన్య, సమంత పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. దాని ఖర్చు పది కోట్లు అని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో మరే సెలబ్రిటీ పెళ్లి జరగలేదు. ఇప్పుడు విజయ్‌, రష్మిక దాన్ని మించి ఒక సెలబ్రేషన్‌ లా మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం.

టాలీవుడ్‌లో ఇదే అత్యంత ఖరీదైన పెళ్లి అవునా?

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ సినిమా రంగంలోనే ఉన్నారు. నటులుగా బిజీగా ఉన్నారు. ఇద్దరూ పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తున్నారు. రష్మిక నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రెండు భారీ పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మొదటిసారి `గీత గోవిందం` చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఇద్దరు క్లోజ్‌ అయ్యారు. అప్పటికీ ప్రేమ స్టార్ట్ కాలేదు. మంచి స్నేహితులుగానే ఉన్నారు. కానీ `డియర్‌ కామ్రేడ్‌` చేసే సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట. మొదట రష్మికనే తనకు ప్రపోజ్‌ చేసిందని తెలిపారు విజయ్‌. అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. ఆ తర్వాత తాను కూడా ఎస్‌ చెప్పడం, ఆ ప్రేమని ఇన్నాళ్లు రహస్యంగా ఉంచారు. ఇప్పుడు పెళ్లితో ఓపెన్‌ చేశారు.

విజయ్, రష్మిక పెళ్లి టాలీవుడ్ లోనే ఒక సంచలనం. ఈ జంట తమ వివాహ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.