|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అమిత్ షా ఇంటికి విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లి తర్వాత సంచలనం!

Published: 26-02-2026, 3:35 PM
షాకింగ్: అమిత్ షా ఇంటికి విజయ్ దేవరకొండ, రష్మిక.. పెళ్లి తర్వాత సంచలనం!
  • విజయ్ దేవరకొండ, రష్మిక‌ల వివాహం ఉద‌య‌పూర్‌లోని ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది
  • రెండు సాంప్ర‌దాయాల ప్ర‌కారం ర‌ష్మిక మెడ‌లో మూడు ముళ్ళు వేసిన విజ‌య్‌ దేవరకొండ‌
  • కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసిన నూతన జంట‌, రిసెప్షన్‌కు ఆహ్వానం
  • ఫిబ్రవరి 26న వివాహం, మార్చి 4న హైద‌రాబాద్‌లోని తాజ్ కృష్ణ‌లో రిసెప్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారనే వార్త టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జంట అమిత్ షాను కలవడం హాట్ టాపిక్ అయింది.

ఉదయపూర్ ప్యాలెస్‌లో వైభవంగా వివాహం

విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), హీరోయిన్ రష్మిక ( Rashmika Mandanna) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ లో ఈ జంట వివాహం జరిగింది. రెండు సాంప్రదాయాల ప్రకారం, విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం జరిగింది. గురువారం ఉదయం 10 గంట‌ల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశాడు విజయ్ దేవరకొండ. ఇక సాయంత్రం వరకు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చేసాయి. స్వయంగా విజయ్ దేవరకొండ, రష్మిక తమ తమ సోషల్ మీడియా వేదికగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

అమిత్ షాను కలిసిన కొత్త జంట

గురువారం పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఇద్దరూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సివిల్ డ్రెస్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah ) ఇంటికి వెళ్లారు విజయ్, రష్మిక. ఈ సందర్భంగా తమ రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. ఇందులో భాగంగానే గణపతి విగ్రహాన్ని అమిత్ షాకు అందించారు. ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికల రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 4వ‌ తేదీన జరగనుంది. హైద‌రాబాద్ లోని తాజ్ కృష్ణ‌లో రాత్రి 7 గంట‌ల‌కు ఈ కార్య‌క్రమం ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక

A post shared by Bollywood Feels (@bollywood__feels)

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి, రిసెప్షన్ గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లు అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.