|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రధాని మోదీని కలిసిన విరోష్ జంట.. పెళ్లికి పిలిస్తే రాలేదు.. కానీ రిసెప్షన్‌కు?

Published: 27-02-2026, 5:36 AM
షాకింగ్: ప్రధాని మోదీని కలిసిన విరోష్ జంట.. పెళ్లికి పిలిస్తే రాలేదు.. కానీ రిసెప్షన్‌కు?
  • విజయ్ దేవరకొండ, రష్మిక‌ల వివాహానికి ప్ర‌ధాని మోదీ ఆశీస్సులు!
  • మార్చి 4న హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు
  • ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్‌లో అంగ‌రంగ వైభవంగా విరోష్ వెడ్డింగ్‌
  • వెడ్డింగ్‌కు త‌రుణ్ భాస్క‌ర్‌, ఈషా రెబ్బా, సందీప్ రెడ్డి వంగా హాజ‌రు

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒక్కటయ్యారు. వీరి వివాహం ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్న విరోష్

Virosh with PM: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. గురువారం పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఈ రోజు ప్రధాని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు ప్రధానిని ఆహ్వానించారు.

డ్రీమ్ వెడ్డింగ్ తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో విరోష్ వెడ్డింగ్ గ్రాండింగ్ జరిగింది. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ జరుగుతుంది. ఈ రిసెప్షన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా వెళ్లి విజయ్, రష్మిక ఆహ్వానించారు.

మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్

మొదట తమ వివాహానికి ప్రధానిని విరోష్ ఆహ్వానించారు. కానీ పెళ్లికి వెళ్లలేకపోయిన మోదీ ఒక స్పెషల్ లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది కొత్త, అందమైన అధ్యాయం. సినిమాల్లో స్క్రిప్ట్ ప్రకారం రష్మిక, విజయ్ నటించారు. కానీ ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. సినిమాల్లో స్క్రిప్ట్ కంటే కూడా ఈ స్క్రిప్ట్ బెటర్ గా ఉండాలని ఆశిస్తున్నా’’ అని ఆ లెటర్ లో మోదీ పేర్కొన్నారు.

ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా విరోష్ వెడ్డింగ్

ఉదయ్ పూర్ లో జరిగిన విరోష్ వెడ్డింగ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు అటెండ్ అయ్యారు. ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్ సమక్షంలో విరోష్ పెళ్లి జరిగింది. ఈ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక‌ల పెళ్లి వేడుక‌ల గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌రిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.