|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దేవరకొండతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. బ్లాక్ బస్టర్ ఖాయమా? వైరల్ న్యూస్!

Published: 07-04-2026, 1:35 PM
విజయ్ దేవరకొండతో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్.. బ్లాక్ బస్టర్ ఖాయమా? వైరల్ న్యూస్!
  • విజయ్ దేవరకొండ, అభిషన్ జీవింత్ కాంబోలో క్రేజీ మూవీ?
  • ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్‌తో రౌడీ హీరో నెక్స్ట్ మూవీ ఫిక్స్!
  • సెప్టెంబర్ 11న ‘రణబాలి’ విడుదల, రష్మిక మందన్న హీరోయిన్
  • త్వరలో అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్ జీవింత్‌తో కలిసి సినిమా చేయనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఎవరితో?

ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లో సైతం బిజీగా ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘రణబాలి’తో బిజీగా ఉన్నాడు. ఇందులో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్‌లో నటిస్తుండగా.. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉంటుండగానే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్. ఈ మేరకు మొదటి చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అభిషన్ జీవింత్‌తో చేతులు కలిపినట్లు తెలుస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ విజయం తర్వాత దర్శకుడు అభిషన్ జీవింత్ ఇటీవల విజయ్ దేవరకొండను కలిసి ఒక కథను వినిపించాడని ఫిలిమ్ వర్గాల సమాచారం. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై విజయ్ సైతం పాజిటివ్ ఓపీనియన్‌తో ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అభిషన్ జీవింత్ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్‌తో కథ ఓకే అయిందా?

సెప్టెంబర్ 11న ‘రణబాలి’ రిలీజ్!

విజయ్ దేవరకొండ, అభిషన్ జీవింత్ కాంబినేషన్లో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.