|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించిన విజయ్.. నిమిషాల్లోనే రద్దు! అసలేం జరిగింది?

Published: 13-05-2026, 5:31 AM
జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించిన విజయ్.. నిమిషాల్లోనే రద్దు! అసలేం జరిగింది?
  • విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించారు.
  • ఈ నియామకంపై వీసీకే, డీఎండీకే నేతల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి.
  • ప్రభుత్వం జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
  • బలపరీక్ష తర్వాత ప్రభుత్వం ఓఎస్‌డీ నియామకాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

తమిళనాడు సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించడం తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రభుత్వం బలపరీక్ష అనంతరం అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

విజయ్ ఓఎస్డీ నియామకంపై తీవ్ర విమర్శలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, నాటకీయ పరిణామాల అనంతరం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనకు మొదటి నుంచి మద్దతుగా నిలిచిన తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ (Radhan Pandit Vetrivel)ను ఓఎస్‌డీ (OSD)గా నియమించారు. కాగా ఈ వ్యవహారంపై వీసీకే నేత వన్నియరసు పాటు డీఎండీకే నేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.

డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ కాంత్.. ‘యువత మీకు ఓటు వేసి గెలిపించారు. కానీ మీరు జ్యోతిష్యులను నమ్ముతున్నారు. ఓఎస్డీగా నియమించడానికి కారణం ఏంటి..? ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని ఆమె చురకలు అంటించారు. ఈ విమర్శల అనంతరం తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్షను నెగ్గిన విజయ్ ప్రభుత్వం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు రద్దు చేసింది.

ప్రతిపక్షాల ఆగ్రహం.. జ్యోతిష్యుడిపై ప్రశ్నలు

బలపరీక్ష అనంతరం సంచలన నిర్ణయం

జ్యోతిష్యుడి నియామకంపై చెలరేగిన వివాదంపై విజయ్ ప్రభుత్వం తక్షణమే స్పందించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలనే సందేశాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.