
📌 Key Points
- విజయ్, రష్మికల వివాహ రిసెప్షన్‌కు అమిత్ షా, మోదీలను ఆహ్వానించిన విరోష్ జంట.
- అమిత్ షాకు వెండి గణేశుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిన ఈ జంట.
- ప్రధాని మోదీ నూతన దంపతులకు ప్రత్యేక లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
- మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. అనంతరం ఈ జంట ఢిల్లీలో అమిత్ షా, ప్రధాని మోదీలను కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించింది. వారి ఆశీస్సులు తీసుకున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.
అమిత్ షాతో విరోష్ జంట భేటీ
Vijay -Rashmika:టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika mandanna) ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం తర్వాత, ఇప్పుడు ఈ జంట దేశ రాజధానిలో సందడి చేస్తోంది. తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రాజకీయ దిగ్గజాలను స్వయంగా ఆహ్వానిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఉదయం అమిత్ షాను కలిసిన ఈ జంట, తాజాగా ప్రధాని మోదీ ఆశీస్సులు కూడా తీసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ‘విరోష్’ జంట కొత్త ప్రయాణంపై ఒక లుక్కేద్దాం.
విజయ్, రష్మిక తమ వివాహ రిసెప్షన్ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ భేటీలో వారు చాలా సాంప్రదాయబద్ధంగా అమిత్ షాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేవలం కార్డే కాకుండా, ఒక అందమైన బాక్స్‌లో వెండి గణేశుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక మస్టర్డ్ యెల్లో సూట్‌లో మెరిసిపోగా, విజయ్ ఐవరీ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ లో స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అమిత్ షాను కలిసిన తర్వాత, ఈ జంట ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసినట్లు సమాచారం. అంతకుముందే ప్రధాని మోదీ విజయ్ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక లేఖ రాస్తూ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్, రష్మికలు తమ సినిమాల్లో ఎన్నో స్క్రిప్టులు చూశారని, కానీ దైవం రాసిన ఈ ‘రియల్ లైఫ్ స్క్రిప్ట్’ వెండితెర మేజిక్ కంటే గొప్పదని మోదీ తన లేఖలో ప్రశంసించడం విశేషం. ఏడు అడుగుల బంధంతో జీవితకాల స్నేహితులుగా మారాలని ఆయన ఆశీర్వదించారు.
మోదీ ఆశీస్సులు తీసుకున్న రష్మిక, విజయ్
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఇప్పుడు మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో చిత్ర పరిశ్రమకు, రాజకీయ ప్రముఖులకు ఘనంగా రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.ఇక దీని కోసమే వారు ఢిల్లీ వెళ్లి పెద్దలను ఆహ్వానిస్తున్నారు. 8 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు తెచ్చిన ఈ జంట, తమ బంధాన్ని ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పిలుచుకుంటూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇకపోతే టాలీవుడ్ నుండి పలువురు సినీ ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించింది ఈ జంట. ఈ రిసెప్షన్ వేడుకలో ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు, ఎందుకంటే సందీప్ రెడ్డివంగా విజయ్ తో అర్జున్ రెడ్డి సినిమా చేసి సంచలనం సృష్టించారు . ఇటు రష్మిక తో యానిమల్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరికీ డైరెక్టర్ సందీప్ చాలా స్పెషల్ కాబట్టి ఆయనను ఈ వేడుకకు స్పెషల్గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తో కలిసి పనిచేసిన, చేయని సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నారు..
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
The #VIROSH Jodi personal Invitation 🤩 #Vijay & #Rashmika personally met Hon’ble Prime Minister #Modi ji invited for the grand reception in Hyderabad ❤️❤️✨ pic.twitter.com/nNiCG2AyJD
— DONO Cinema (@DONOCinema) February 27, 2026
మొత్తానికి విరోష్ జంట తమ వివాహ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో హైదరాబాద్‌లో సందడి చేయనున్నారు. ఈ వేడుక ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


