
📌 Key Points
- నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి.
- అనసూయ, చిన్మయి, పాయల్ రాజ్‌పుత్ వంటి స్టార్ హీరోయిన్లు శివాజీకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
- “మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో మీరు చెప్పడానికి మీరెవరు?” అని పాయల్ రాజ్‌పుత్ నిలదీసింది.
- వివాదం ముదరడంతో శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ, చర్చ కొనసాగుతోంది.
నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి. అనసూయ, పాయల్ రాజ్‌పుత్ వంటి స్టార్ హీరోయిన్లు శివాజీకి ఘాటుగా కౌంటర్ ఇవ్వగా, పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయన క్షమాపణలు కోరారు. ఈ వివాదం పూర్తి వివరాలు ఇక్కడ.
అనసూయ vs శివాజీ: మాటల యుద్ధం
Actor Shivaji : ‘దండోరా’ సినిమా వేడుకలో శివాజీ చేసిన హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త యుద్ధానికి దారితీశాయి. హీరోయిన్లు నిండుగా చీరకట్టులో ఉంటేనే అందమని, బహిరంగ వేదికలపై అలా అర్ధనగ్నంగా తిరగడం ఏంటని శివాజీ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను కించపరిచేలా ఉన్నాయని ఇప్పటికే పలువురు స్టార్స్ మండిపడ్డారు.
అనసూయ vs శివాజీ తన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు స్పందించిన తీరుపై కూడా శివాజీ మాట్లాడారు. కొందరు కావాలనే వారికి ట్యాగ్ చేసి వివాదాన్ని పెద్దది చేస్తున్నారని, కనీసం ఒక్కరైనా తనతో మాట్లాడి సారీ చెప్పమని అడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ మరోసారి నిప్పులు చెరిగారు. “అతి వినయం ధూర్త లక్షణం” అంటూ శివాజీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమ్మా, తల్లీ అని పిలుస్తూనే అదుపు చేయాలనుకునే వారే చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.
పాయల్ రాజ్‌పుత్ సూటి ప్రశ్నలు
నిలదీసిన పాయల్ రాజ్‌పుత్ ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, శివాజీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.మేము ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? మా డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అంటూ ఆమె సూటిగా నిలదీశారు.ఒక బహిరంగ వేదికపై మహిళల గురించి అంత నీచంగా మాట్లాడటం దారుణమని, ఆయన వ్యాఖ్యలు అసహ్యించుకునేలా ఉన్నాయని పాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు టాలీవుడ్‌లో మళ్లీ పునరావృతం కాకూడదని, మహిళా నటుల గౌరవానికి భంగం కలగకూడదని ఆమె డిమాండ్ చేశారు.
I hope it’s okay to express my feelings. I felt uncomfortable hearing some remarks about women made by Shivaji Garu on a public platform. I must admit it made me feel uneasy, especially regarding his comments on women. #weknowbetter 🙏🏼 pic.twitter.com/eDfXsLT4Hv
వివాదం ముదరడం, శివాజీ క్షమాపణ
— paayal rajput (@starlingpayal) December 24, 2025
క్షమాపణలు చెప్పిన శివాజీ పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్లు, టెక్నీషియన్లు శివాజీపై విరుచుకుపడటంతో వివాదం ముదిరింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో, శివాజీ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని, తన ఉద్దేశం అది కాదని చెబుతూ ఆయన బహిరంగంగా క్షమాపణలు కోరారు. శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వస్త్రధారణ అనేది స్త్రీల వ్యక్తిగత విషయమని కొందరు, సంప్రదాయం పాటించడంలో తప్పేముందని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్టార్ హీరోయిన్ల ప్రతిస్పందనతో వివాదం ముదరగా, ఆయన చివరికి క్షమాపణలు చెప్పారు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.


