
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరి 26న జరగడం లేదని సమాచారం.
- కొత్త సమాచారం ప్రకారం వీరి వివాహం ఫిబ్రవరి 2న ఉదయ్‌పూర్‌లో జరగవచ్చు.
- విజయ్, రష్మికల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా జరిగిందని సమాచారం.
- పెళ్లి గురించి రష్మిక అధికారికంగా వెల్లడించకపోయినా, ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియో వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 2న పెళ్లి జరగనుందని ఒక వీడియో వైరల్ అవుతోంది.
విజయ్, రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26 కాదా?
Vijay Rashmika Wedding: టాలీవుడ్ క్యూట్ పెయిర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న(Rashmika Mandanna) జంట ఒకటి. ఈ జంటకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు కానీ వీరి నిశ్చితార్థం ప్రైవేటుగా కొంతమంది సమక్షంలో జరిగిందని విజయ్ దేవరకొండ టీం వెల్లడించారు. ఇక రష్మిక విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లోని ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగబోతుందని ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇలా వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్న పెళ్లికి సంబంధించిన విషయాన్ని మాత్రం అధికారకంగా వెల్లడించలేదు.
రష్మిక మందన్న పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో ఈమె పెళ్లి గురించి ప్రస్తావనకు రావడంతో కచ్చితంగా అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటానని చెప్పారే తప్ప పెళ్లి తేదీని మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 2వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ చెప్పటం గమనార్హం. ఇక పెళ్లి పనులలో భాగంగా ఉదయపూర్ ప్యాలెస్ ఎంతో అందంగా ముస్తాబవుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ఫిబ్రవరి 2న ఉదయ్‌పూర్‌లో వివాహం?
Buzz Update: #RashmikaMandanna & #VijayDevarakonda wedding works underway in Udaipur 💍 Sources say the big day is on Feb 2nd 👀✨ pic.twitter.com/KnoEOIcjRr
— Gowtham (@GowthamCinemas) January 31, 2026
వైరల్ అవుతున్న ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియో
ఫిబ్రవరి రెండో తేదీ పెళ్లి అంటే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అయినప్పటికీ రష్మిక విజయ్ మాత్రం పెళ్లి గురించి వెల్లడించకపోవడానికి గల కారణం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఫిబ్రవరి రెండో తేదీ వీరి పెళ్లి కాదని ఇది కేవలం రూమర్ మాత్రమే అంటూ ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక దేవరకొండ పెళ్లి గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలో హల్ ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పరంగా వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ముచ్చటగా మూడోసారి వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి అనే సినిమాలో వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించబోతున్నారు .
మొత్తానికి విజయ్, రష్మిక పెళ్లి వార్తలు ఇంకా గందరగోళంగానే ఉన్నాయి. ఫిబ్రవరి 2న పెళ్లి జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై ఒక స్పష్టత వస్తుంది.


