
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఉదయం 10 గంటలకు జరిగింది.
- హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహ వేడుక జరిగింది.
- వివాహం అనంతరం మీడియాకు స్వీట్స్ పంపిణీ చేశారు.
- మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక జరగనుంది.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎట్టకేలకు జరిగింది. వీరి వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరిగింది. మీడియాకు స్వీట్స్ పంపిణీ చేశారు. త్వరలో రిసెప్షన్ కూడా జరగనుంది.
విజయ్, రష్మికల వైభవంగా వివాహం
Vijay Rashmika wedding: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విరోష్ వెడ్డింగ్(Virosh Wedding) అంగరంగ వైభవంగా, అతిథులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. నేడు ఉదయం 10 గంటల సమయంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక (Rashmika)మెడలో మూడు ముళ్ళు వేశారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ రష్మిక నేడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోయిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రష్మిక విజయ్ దేవరకొండ వివాహం పూర్తి అయిన అనంతరం కొంతమంది పిల్లలకు అలాగే మీడియాకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మీడియా వారి కోసం ఈ జంట ప్రత్యేకంగా స్వీట్స్ పంపించడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. రష్మిక విజయ్ నేడు ఉదయం ఐటీసీ మెమోంటోస్ రిసార్ట్ లో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు . ఇక ఈరోజు సాయంత్రం కొడవు సాంప్రదాయ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోబోతున్నారు.
మీడియాకు స్వీట్స్ పంపిణీ చేసిన జంట
రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొడువు సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం సాయంత్రం జరగబోతోంది. ఇక వీరి వివాహ వేడుకలు కేవలం కొంతమంది అతిథులు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రం ఈ జంట ఎక్కడ బయట పెట్టలేదు. ఇక రష్మిక విజయ్ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నప్పటికీ రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. వీరి రిసెప్షన్ మార్చి 4వ తేదీ హైదరాబాదులో ఎంతో ఘనంగా జరగబోతోంది. ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.
?igsh=MTRtazliMHplenV2cg==
మార్చి 4న ఘనంగా రిసెప్షన్
రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గీతగోవిందం అనే సినిమా ద్వారా మొదటిసారి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తదుపరి డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇలా వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఈ జంట మాత్రం ఎక్కడా తమ రిలేషన్ బయట పెట్టలేదు. తమ రిలేషన్ గురించి సైలెంట్ గా ఉంటూనే ఈ జోడి పెళ్లిని ప్రకటించారు. ఇన్ని రోజులు ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
మొత్తానికి విజయ్ రష్మికల పెళ్లి వార్త అభిమానులకు ఆనందాన్నిచ్చింది. వీరిద్దరూ కలిసి మరింత సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. మార్చి 4న జరగబోయే రిసెప్షన్ కోసం ఎదురుచూద్దాం.


