|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సంచలనం: సంగీతతో విడాకులు, త్రిషతో పెళ్లి.. అసలు నిజం ఇదేనా? మాస్ అప్డేట్!

Published: 07-03-2026, 11:05 AM
విజయ్ సంచలనం: సంగీతతో విడాకులు, త్రిషతో పెళ్లి.. అసలు నిజం ఇదేనా? మాస్ అప్డేట్!
  • విజయ్, సంగీత విడాకుల వ్యవహారంపై దేశవ్యాప్తంగా సంచలనం, అసలు కారణం అదేనా?
  • త్రిషతో విజయ్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో, అభిమానుల్లో ఆందోళన!
  • సంగీత విడాకుల పిటిషన్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన విజయ్ సన్నిహితులు.
  • విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం, ప్రజల సమస్యలపై పోరాటానికి సిద్ధం!

తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితంలో పెను సంచలనం! సంగీతతో విడాకులు, త్రిషతో పెళ్లి వార్తలపై ఆయన ఎలా స్పందించారో చూడండి. ఈ హాట్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

విడాకులపై విజయ్ రియాక్షన్: అసలేం జరిగిందంటే?

Vijay: టీవీకే పార్టీ అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ఎట్టకేలకు నోరు విప్పాడు. ఇటీవల ఆయనపై వస్తున్న వార్తలకు ఆయన సమాధానం చెప్పాడు. విజయ్ నుంచి ఆయన సతీమని సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. పెళ్ళైన 26 ఏళ్ళ తరువాత ఆమె విజయ్ నుంచి విడాకులు కోరడం అనేది సంచలనంగా మారింది. అంతేకాదు, అందుకు ఆమె చెప్పిన కారణం కూడా కొత్త అనుమానాలను రేకెత్తించింది.

విజయ్ కొన్నేళ్లుగా వేరే హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు, అందుకే, ఆయన నుంచి నాకు విడాకులు కావాలంటూ ఆమె పిటీషన్ లో పేర్కొంది. దాంతో ఆ హీరోయిన్ ఎవరు అంటూ సెర్చింగ్ మొదలయ్యింది. ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా విజయ్- త్రిష ల మధ్య ఎదో నడుస్తుంది అని, త్వరలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

త్రిషతో పెళ్లి వార్తల్లో నిజమెంత? విజయ్ క్లారిటీ!

దాంతో, సంగీత చెప్పిన స్టార్ హీరోయిన్ త్రిషనే అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి జంటగా వచ్చారు విజయ్- త్రిష. దాంతో, ఇద్దరిపై వస్తున్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే, ఎట్టకేలకు తాజాగా జరుగుతున్న పరిణామాలపై నోరువిప్పాడు విజయ్(Vijay).. ‘ఈమద్య చాలా వివాదాలు వస్తున్నాయి. ఆ విషయంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు.

రాజకీయాల్లోకి విజయ్: ప్రజల కోసం ఏం చేయబోతున్నాడు?

మీరు కూడా ఆ వార్తల వల్ల బాధపడుతున్నారని తెలుసు. మీరు బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అవి నా వ్యక్తిగత సమస్యలు. వాటి గురించి నేను చూసుకుంటాను. మీరు వాటిగురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు మనమందరం కలిసి ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

విజయ్ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.