|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విడుదలకు ముందే విలన్ అయ్యాడా విజయ్ సేతుపతి? ‘గాంధీ టాక్స్’కు షాకింగ్ టాక్!

Published: 29-01-2026, 4:35 AM
విడుదలకు ముందే విలన్ అయ్యాడా విజయ్ సేతుపతి? 'గాంధీ టాక్స్'కు షాకింగ్ టాక్!
  • విజయ్ సేతుపతి నటించిన ‘గాంధీ టాక్స్’ సినిమా విడుదలకు ముందే టాక్ తెచ్చుకుంది.
  • ఈ సినిమాలో మాటలు లేకుండా భావోద్వేగాలు, సంగీతం ద్వారా కథ చెప్పే ప్రయత్నం చేశారు.
  • ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడింది.
  • సినిమా ప్రమోషన్ సరిగా లేదని, ప్రీ బుకింగ్స్ కూడా బలహీనంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘గాంధీ టాక్స్’ విడుదలకు ముందే నెగటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఆర్థిక సమస్యలు, ప్రమోషన్ల లోపం కారణంగా సినిమాపై అంచనాలు తగ్గాయి. దీని ప్రభావం బాక్సాఫీస్ ఓపెనింగ్స్ పై పడే అవకాశం ఉంది.

విడుదలకు ముందే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘గాంధీ టాక్స్’

Telugu Upcoming Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు తెలుగు హీరోలను ఎంతగా ఆదరిస్తారో.. తమిళ హీరోలను కూడా అంతగానే ఆదరిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. సూర్య, విశాల్, కార్తీ ఇలాంటి హీరోలను తెలుగు హీరోలతో సమానంగా అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక తక్కువ కాలంలోనే ఇలాంటి పేరు తెచ్చుకున్న మరో తమిళ హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈయన గత సినిమా మహారాజు కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రాబోతున్న విజయ్ సేతుపతి చిత్రం మాత్రం.. విడుడలకు ముందే ఫ్లాప్టాప్ తెచ్చుకోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

విజయ్ సేతుపతి నటిస్తున్న తాజా సినిమా ‘గాంధీ టాక్స్’ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తలైవన్ తలైవీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఈ కొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.

గాంధీ టాక్స్‌సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మాటల డైలాగులు లేవు. పూర్తిగా భావోద్వేగాలు, సంగీతం.. దృశ్యాల ద్వారానే కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా షూటింగ్ 2023లోనే ప్రారంభమైంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. చివరికి చాలా ఆలస్యంగా నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేశారు.

సినిమా విడుదల వాయిదాకు కారణాలు?

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అరవింద్ స్వామి, అదితి రావు హైదరి వంటి మంచి నటులు ఉన్నప్పటికీ, సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల బాక్సాఫీస్ ఓపెనింగ్ కష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుడిలో కూడా ఈ సినిమా చూడాలి అన్న ఇంటరెస్ట్ ఉండడం లేదు.

సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా టీమ్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ సినిమాకు సరైన ప్రచారం జరగలేదని అంటున్నారు. మాటలే లేని సినిమా కావడంతోనే ఇది మొదటినుంచి సవాలుతో కూడిన ప్రాజెక్ట్. అలాంటప్పుడు మరింత బలమైన ప్రమోషన్ అవసరం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విజయ్ సేతుపతి మరియు గాంధీ టాక్స్’హ‌టీమ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నా, సినిమా విడుదలపై సరైన అవగాహన ప్రేక్షకులకు చేరలేదనే మాట వినిపిస్తోంది. ఈ దశలో సినిమాను కాపాడగలిగేది ఒక్క మంచి మాటల ప్రచారమే అని అంటున్నారు. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మెచ్చితేనే పరిస్థితి మారే అవకాశం ఉంది.

ప్రేక్షకుల్లో ఆసక్తి లేకపోవడానికి కారణం ఏమిటి?

జనవరి 30 తర్వాత ‘గాంధీ టాక్స్’ బాక్సాఫీస్ ఫలితం ఏంటన్నది తేలిపోతుంది. ఈ సినిమా విజయం లేదా అపజయం, విజయ్ సేతుపతి విజయ పరంపర కొనసాగుతుందా లేదా అన్నదాన్ని నిర్ణయించనుంది.

మొత్తానికి, విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ విడుదల విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సినిమా ప్రమోషన్లు సరిగా లేకపోవడం, ప్రేక్షకుల ఆసక్తి లేకపోవడం వంటి అంశాలు సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.