|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ గెలుపుతో డబుల్ బొనాంజా! త్రిష బర్త్‌డే రోజునే ఫలితాలు.. అసలు విషయం తెలిస్తే షాకే!

Published: 16-03-2026, 2:05 AM
విజయ్ గెలుపుతో డబుల్ బొనాంజా! త్రిష బర్త్‌డే రోజునే ఫలితాలు.. అసలు విషయం తెలిస్తే షాకే!
  • విజయ్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు వ్యక్తిగత విషయాలను తెరపైకి తెస్తున్నారు.
  • విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి, అదే రోజు త్రిష పుట్టినరోజు.
  • విజయ్ గెలిస్తే, అది ఆయనకు డబుల్ ధమాకా అవుతుందని అభిమానులు అంటున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఎన్నికలలో గెలిస్తే అది ఆయనకు డబుల్ ధమాకా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్, త్రిషల మధ్య సంబంధం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

విజయ్ రాజకీయ జీవితంపై వ్యక్తిగత దాడి

Vijay Thalapathy:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ దళపతి (Vijay Thalapathy) ఈ ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ టీవీకే ద్వారా రంగంలోకి దిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయంగా అడుగులు వేస్తుంటే.. మరొకవైపు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.. ముఖ్యంగా విజయ్ రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని మధ్యలోకి లాగుతూ.. ఆయన ఇమేజ్ కి డామేజ్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఇలాంటి సమయంలో విజయ్ దళపతి గనుక విన్ అయితే ఆయనకు డబుల్ ధమాకా లభించినట్లే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గత కొంతకాలంగా విజయ్ – త్రిష(Trisha ) మధ్య ఏదో రిలేషన్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అటు రాజకీయ నాయకులు కూడా విజయ్ కి – త్రిషకి మధ్య రిలేషన్ ఉంది అంటూ వార్తలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు ప్రముఖ దర్శకుడు పార్దిబన్ , సముద్రఖని కూడా వీరిపై కామెంట్లు చేశారు. ఇలా పలువురు సెలబ్రిటీలు వీరి బంధం పై కామెంట్ చేస్తున్న సమయంలో మళ్ళీ విజయ్.. త్రిషను తీసుకొని ఒక పెళ్లి వేడుకకు హాజరవ్వడం సంచలనంగా మారింది. అయితే అటు విజయ్ ఇటు త్రిష ఇవేవీ తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్ డేట్ ను ప్రకటించడంతో మరో వార్త తెరపైకి వచ్చింది . ఒకవేళ విజయ్ గనుక విన్ అయితే ఆయనకు డబుల్ ధమాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజయ్, త్రిషల మధ్య సంబంధంపై పుకార్లు

అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్ మే 4వ తేదీన వెలువడనున్నాయి. అటు త్రిష బర్తడే కూడా ఆరోజే కావడం గమనార్హం. ఒకవేళ విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో తన టీవీకే పార్టీతో అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఒకవైపు త్రిష బర్తడే మరొకవైపు ఎలక్షన్ విన్నింగ్ ఆయన కెరియర్ లో ఈ సందర్భం మర్చిపోలేనిదిగా మిగులుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలి అంటే మే 4 వరకు ఎదురు చూడాల్సిందే.

మే 4న ఎన్నికల ఫలితాలు, త్రిష పుట్టినరోజు

ఇదిలా ఉండగా మరొకవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ దళపతి టీవీకే పార్టీ, భాజపా జట్టు కట్టే ప్రయత్నంలో ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పొత్తు విషయంలో టీవీకే అధినేత విజయ్ క్లారిటీ ఇచ్చినా సరే రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఇక తాజా ఎన్నికల్లో బిజెపి గెలిస్తే విజయ్ కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం . ఇకపైగా పొత్తులో భాగంగా విజయ్ పార్టీకి 80 సీట్లు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ మారాయి.

విజయ్ గెలుపు, త్రిష పుట్టినరోజు ఒకేరోజు కావడంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మే 4 వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఎలాంటి సమాచారం తెలియదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.