
📌 Key Points
- విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
- నటితో ఎఫైర్ ఉందంటూ సంగీత ఆరోపణలు.
- కుమారుడు జేసన్ సంజయ్ తండ్రిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు.
- ఆస్తిలో వాటా వద్దని, తల్లితోనే ఉంటానని జేసన్ తెలిపినట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో వరుస సమస్యలు ఎదుర్కొంటున్నారు. భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, కుమారుడు జేసన్ సంజయ్ కూడా తండ్రికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు కోలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
విజయ్ భార్య విడాకుల వ్యవహారం
Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు వరుసగా షాక్ లు ఎదురవుతున్నాయి.. ఈ మధ్య రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేందుకు ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వరుసగా సమస్యల్లో పడుతున్నాడు. అయితే ఇటీవల ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. అయితే ఆమె అతనికి నటితో ఎఫైర్ ఉందంటూ ఆరోపిస్తూ విడాకులు కోరింది. ప్రస్తుతం ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. తన భార్య సంగీత గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఇది నడుస్తుండగానే ఆయన కొడుకు కూడా విజయ్ కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిన్న సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన విషయం తెలిసిందే. మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అదేంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
హీరో విజయ్ భార్య విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కడంతో ప్రస్తుతం అతనిపై మరో చర్చ నడుస్తుంది. దీంతో పాటుగా విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సోషల్ మీడియాలో తన తండ్రిని అన్‌ఫాలో చేశాడన్న వార్త వైరల్ అవుతోంది. అయితే అతని కొడుకు తండ్రిని అన్ ఫాలో చేయడం పై నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. అంతే కాదు ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నటి తో ఎఫైర్ పెట్టుకున్నారు అన్న వార్తల్లో నిజం లేదు కానీ… అతని కొడుకు మాత్రం తండ్రి ఆస్తిలో వాటా వద్దు అని అన్నట్లు తెలుస్తుంది.. తండ్రితో కూడా ఇకమీదట కలవడానికి ఇష్టపడడం లేదు అంటూ ఆయన సన్నిహితుల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఇకమీదట తల్లితోనే ఉండబోతున్నాడు అంటూ మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఇది కోలీవుడ్ ఇండస్ట్రీ తో పాటుగా సోషల్ మీడియాలో హాట్చర్చగా మారింది..
కుమారుడు జేసన్ సంజయ్ సంచలన నిర్ణయం
కోలీవుడ్ లో విజయ్ వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్
కోలీవుడ్ హీరో విజయ్ కుమారుడు బేషన్ సంజయ్ ఇటీవలే ఇండస్ట్రీలో దర్శకుడుగా పరిచయం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇలాంటి సమయంలో తండ్రి గురించి తల్లి గురించి వార్తలు రావడంతో అతను బాధలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ విషయాలపై స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాలి.. రజినీకాంత్ తర్వాత కోలీవుడ్‌లో అదే స్థాయి స్టార్డమ్‌ను అందుకున్న హీరోగా విజయ్ గుర్తింపు పొందారు. అయితే అటువంటి స్టార్‌డమ్‌ను పక్కనబెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఎలా మారుతుందని అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.. మరి వివాదాలు ఎంతవరకి వెళ్తాయో తెలియదు.. ఇకపోతే హీరో విజయ్ నటించిన సినిమా జన నాయగన్ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.. ఎప్పుడు విడుదల అవుతుంది సినిమా టాక్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది..
విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ సమస్యల నుంచి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాలి. దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


