|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Varma: ‘దంగల్’ బ్యూటీతో విజయ్.. రిలేషన్‌లో ఉన్నారా?

Published: 23-06-2025, 11:16 PM
Vijay Varma: 'దంగల్' బ్యూటీతో విజయ్.. రిలేషన్‌లో ఉన్నారా?

టాలీవుడ్‌లో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణం. ఇటీవల విజయ్ వర్మ గురించి ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Key Points

1

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ తో కనిపించడంతో డేటింగ్ రూమర్స్

2

తమన్నా తో విజయ్ వర్మ గత సంబంధం గురించి ప్రస్తావన

4

రూమర్స్ నిజమా కాదా అనేది ఇంకా తెలియదు

విజయ్ వర్మ మరియు ఫాతిమా సనా షేక్ డేటింగ్ రూమర్స్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, పెళ్లి.. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. టాలీవుడ్‌లో తక్కువ గానీ బాలీవుడ్‌లో మాత్రం ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇవి నిజమనేటట్లు సదరు హీరోహీరోయిన్ జంటగా కనిపించడం, బయట కూడా కెమిస్ట్రీ పండించడం లాంటివి చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం వరకు తమన్నా-విజయ్ వర్మ గురించి ఇలానే మాట్లాడుకున్నారు.

తమన్నాతో విజయ్ వర్మ గత సంబంధం

దాదాపు రెండు మూడేళ్ల పాటు తమన్నా.. నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేసిందనే ప్రచారం అయితే గట్టిగానే నడించింది. అందుకు తగ్గట్లు జంట పక్షుల్లా ఎక్కడపడితే అక్కడ వీళ్లిద్దరూ కనిపించేవారు. ప్రేమ, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడేవారు కూడా. మరి ఏమైందో ఏమోగానీ ఈ జంట బ్రేకప్ చెప్పేసుకుంది. కలిసి కనిపించడమే మానేశారు. ప్రస్తుతం తమన్నా.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. విజయ్ ఏం ప్రాజెక్టులు చేస్తున్నాడో తెలీదు.

‘గుస్తాఖ్ ఇష్క్’ సినిమా ప్రభావం?

అలాంటిది ఇప్పుడు విజయ్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘దంగల్’ బ్యూటీ, హీరోయిన్ ఫాతిమా సనా షేక్‌తో కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి. వీటిలో ఎంత నిజముందో తెలీదు. రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే మూవీ చేస్తున్నారు. మరి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేమలో పడ్డారా? లేదంటే ఇవి కేవలం రూమర్సేనా అనేది క్లారిటీ రావాలి?

విజయ్ వర్మ మరియు ఫాతిమా సనా షేక్ డేటింగ్ గురించిన వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు. వారి సినిమా ‘గుస్తాఖ్ ఇష్క్’ విడుదల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.