|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vijay Varma : తమన్నాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ హీరోయిన్ తోనే రిలేషన్..?

Published: 25-06-2025, 12:49 AM
Vijay Varma : తమన్నాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ హీరోయిన్ తోనే రిలేషన్..?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నాతో విడిపోయాడనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. తాజాగా, విజయ్ వర్మ ఫాతిమా సనా షేక్ తో సన్నిహితంగా కనిపిస్తున్నాడు. ఇది వారిద్దరి మధ్య ప్రేమ సంబంధమా లేక స్నేహమా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Key Points

1

విజయ్ వర్మ మరియు తమన్నా విడిపోయారనే వార్తలు

2

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ కలిసి కనిపించడం

4

ఫ్రెండ్‌షిప్ లేదా రొమాన్స్ అనే విభిన్న అభిప్రాయాలు

తమన్నాతో విజయ్ వర్మ విరామం

Vijay Varma : బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తమన్నాతో రిలేషన్ లో ఉన్నాడని వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం అధికారికంగానే ప్రకటించారు. లస్ట్ స్టోరీస్ సినిమా సమయంలో తమన్నా – విజయ్ క్లోజ్ అయ్యారని, ఇద్దరూ ప్రేమించుకున్నారని చెప్తూ ఒకరి గురించి ఒకరు తెగ పొగిడేశారు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ కలిసి కనిపించి క్యూట్ లవ్ కపుల్ అనిపించుకున్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో అంతలోనే ఈ ఇద్దరూ విడిపోయారు. లవ్ స్టోరీ అధికారికంగా చెప్పినా వాళ్ళు విడిపోయింది మాత్రం చెప్పలేదు. కానీ తమన్నా, విజయ్ వర్మ సన్నిహితులు మాత్రం వాళ్ళు విడిపోయారు అనే చెప్తున్నారు. ఈ ఇద్దరూ కూడా కలిసి కనపడట్లేదు. అయితే తాజాగా విజయ్ వర్మ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఫాతిమా సనా షేక్ తో కొత్త సంబంధం?

ఫాతిమా సనా షేక్ అనే హీరోయిన్ తో విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నాడట. ఇటీవల వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ కేఫ్ లో క్లోజ్ గా కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని బాలీవుడ్ అంటుంది. ఫాతిమా సనా షేక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి దంగల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లూడో, థార్, సామ్ బహదూర్.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. అయితే ఫాతిమా సనా షేక్, విజయ్ వర్మ కలిసి గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారని, ఆ సినిమా కోసమే ఇలా క్లోజ్ గా తిరుగుతున్నారని, వాళ్ళ మధ్య ఏం లేదని, వాళ్ళు ఫ్రెండ్స్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వార్తలపై వివిధ అభిప్రాయాలు

విజయ్ వర్మ మరియు ఫాతిమా సనా షేక్ మధ్య ఉన్న సంబంధం స్నేహమా, ప్రేమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వారి సినిమా షూటింగ్ కారణంగానే వారు దగ్గరగా ఉంటున్నారని కొందరు అనుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.